Wednesday , September 18 2024

శ్రీ రామానుజ ఫిలాసఫికల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పదవ తరగతి పిల్లలకు ఫ్యాడులు పంపిణీ

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా మార్చి 14: జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల తిలక్ నగర్ (భగత్ సింగ్ నగర్), మోంటిసోరి హై స్కూల్ 10వ, తరగతి విద్యార్థులకు పీపుల్ ఫౌండేషన్ చైర్మన్ యాతాకుల సునీల్ నిర్వహణలో శ్రీ రామానుజ ఫిలాసఫికల్ ట్రస్ట్ సౌజన్యంతో పెన్నులు ఫ్యాడులు పంపిణీ చేయడం జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 19వ, వార్డు కౌన్సిలర్ సుంకరి అరుణ రమేష్,మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ పెద్దపంగు స్వరూపరాణి హాజరై మాట్లాడుతూ శ్రీ రామానుజ ఫిలసాఫికల్ ట్రస్ట్ పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు అందించడం ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలిపారు ,ఈ సందర్భంగా రామానుజ ఫిలసాఫికల్ ట్రస్ట్ కు మరియు పీపుల్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ట్రస్టు కో ఆర్డినేటర్ సాలగ్రామ గిరి మాట్లాడుతూ , శ్రీ రామానుజ ఫిలసాఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆంధ్ర, తెలంగాణలోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో అసహాయులకు, నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తూ, చైర్మన్ శ్రీ మాచవరం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమాలు చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్, పేరెంట్స్ కమిటీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు భూపతి నారాయణ గౌడ్, మోంటిసోరి కార్పడెంట్ రవీందర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.