Wednesday , July 24 2024

మహిళలకు బరోసా సెంటర్ ద్వారా న్యాయం జరగాలి.

మహిళ సాధికారతకు అధిక ప్రాధాన్యత.

భరోసా పై జిల్లాలో అవగాహన కల్పించాలి.

ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలి.

భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి.

తెలంగాణ కెరటం సూర్యాపేటజిల్లా ప్రతినిధి మార్చి 09 : మహిళల ఫిర్యాదులపై సత్వరమే స్పందించి భరోసా కేంద్రం ద్వారా న్యాయం జరగాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరా ల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
జిల్లా కేంద్రంలో సువెన్ ఫార్మా కంపెనీ ప్రక్కన పోలీసు శాఖ, సువెన్ ట్రస్ట్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన బరోసా సెంటర్, షీ టీమ్స్ కార్యాలయాన్ని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ బరోసా సెంటర్ల ఏర్పాటు చేసిన పోలీసు శాఖ, భాగస్వామ్యం ఐన సువెన్ ఫార్మా ను మంత్రి అభినందించారు. మహిళల, బాలలపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖకు మంత్రి ఆదేశించారు. మహిళా రక్షణ చట్టాలపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గంజాయి నిర్మూలనలో కటినంగా వ్యవహరించాలని సూచించారు.
మహిళలపై వేదింపులు, హత్యాచారం, దాడులకు, నిరాదరణకు గురైన బాధిత మహిళలకు, పిల్లకు ఒకే చోట కేసుల నమోదు, వైద్య, న్యాయ, మానసిక దైర్యం, అవసరమైన పిల్లలకు విద్యా వసతి, పునరావాసం, కౌన్సిలింగ్ ఇవ్వడం, కోర్టుల విషయాలు ఇలా అన్ని సౌకర్యాలు ఒకే చోట కల్పిస్తూ బరోసా సెంటర్ ను ఏర్పాటు చేయడం అనే ఆలోచన చాలా మంచి ఆలోచన అని, ఈ ఏర్పాటు ఆలోచన చేసిన పోలీసు శాఖను, భాగస్వామ్యమైన సు ఫార్మా ట్రస్ట్ ను అభినందించారు. మహిళల రక్షణలో పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళలను, బాలలను వేదించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఆదేశించారు. భౌతిక దాడులను, హత్యాచారం దాడులను అడ్డుకోవడం మన అందరి బాధ్యత, వేదింపులకు సంభందించి దైర్యంగా పిర్యాదు చేయాలి అని మంత్రి తెలిపినారు. బరోసా సెంటర్, షీ టీమ్స్ పని తీరు, చట్టాల అమలుపై గ్రామాల్లో అవగాహనా కల్పించాలని సూచించారు.జిల్లాలో గంజాయి రవాణా, అమ్మకాలను నిరోధించడంలో పోలీసు శాఖ నిరంతర కృషి చేయాలని, గాంజా ములాను గుర్తించి పూర్తి స్థాయిలో అరికట్టాలని, గంజాయి రహిత జిల్లాగా, గంజాయి రహిత రాష్ట్రంగా చేయండంలో బాగా పని చేయాలని ఆదేశించారు.ఎస్పీ రాహుల్ హెగ్డే బరోసా సెంటర్ యొక్క ఏర్పాటు లక్ష్యం, ఉద్దేశ్యం గురించి వివరించారు, దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర పోలీసు మహిళ అండ్ చెల్డ్ వెల్ఫేర్ అధ్వర్యంలో బరోసా సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగినది ఎస్పి అన్నారు. మహిళల రక్షణగా, పిల్లల పై లైంగిక దాడుల నివారణ, నిరాదరణకు, దాడులకు గురైన మహిళలకు, పిల్లకు అండగా ఉండడం ఒకేచోట అవసరమైన అన్ని సహాయాలు అందించడం లక్ష్యం అని అన్నారు. కేసులో నేరస్తునికి శిక్ష పడే వరకు, కేసు ముగిసే వరకు సపోర్ట్ పరసన్, లీగల్ అడ్వైసర్, మెడికల్ ఆఫీసర్ అందుబాటులో ఉంటారని అన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెలు, జిల్లా కలక్టర్ వెంకట్రావు, జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే, స్థానిక ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్ పద్మ, సువెన్ యాజమాన్యం, దామోదర్ రెడ్డి, చెవిటి వెంకన్న, వేనారెడ్డి. అదనపు ఎస్పీ లు నాగేశ్వర రావు, జనార్ధన్ రెడ్డి,డి డబ్ల్యూ ఓ వెంకటరమణ, డిసి పి ఓ రవి కుమార్, డీఎస్పీ , బరోసా సెంటర్ సిబ్బంది ఎస్సై మౌనిక, సిబ్బంది పాల్గొన్నారు.