Thursday , November 7 2024

మాదిగ జాతి కోసం జాతి ప్రయోజనాల కోసం అందరూ కలిసి పనిచేయాలి

టి ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు తప్పెట్ల శ్రీరాములు మాదిగ
తెలంగాణ కెరటం సూర్యాపేటజిల్లా ప్రతినిధి మార్చి 09 : జిల్లా కేంద్రంలో టి ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో సూర్యాపేట జిల్లా స్థాయి విసృత సమావేశానికి జిల్లా అధ్యక్షుడు పుట్టల శ్రావణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా టి ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు తప్పెట్ల శ్రీరాములు మాదిగ పాల్గొని మాట్లాడుతూ మాదిగ జాతి కోసం జాతి ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు. ఎవరి స్వప్రయోజనాల కోసం ఎవరి వ్యక్తిగత విషయాల కోసం టిఎంఆర్పిఎస్ ని అడ్డుపెట్టుకొని చెడు పేరు తేవద్దని అన్నారు. కొంతమంది వ్యక్తులు టి ఎమ్మార్పీఎస్ పేరు పెట్టుకొని మేము జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు సమాజంలో చలామణి అవుతున్నారు. మాకు అలాంటి వారికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. టి ఎమ్మార్పీఎస్ తరఫున జిల్లా అధ్యక్షులు పుట్టల శ్రవణ్ కుమార్ కొనసాగుతాడని,జిల్లా కమిటీని గాని రాష్ట్ర కమిటీని గాని నా ఆధ్వర్యంలో జరగాలి కానీ ఎవరో కమిటీ వేసుకొని మేము జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులుఅని చెప్పుకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అన్నారు. అనంతరం నూతనపట్టణకమిటీనిప్రకటించారు. సూర్యాపేట టి ఏమ్మార్పిస్ పట్టణ ప్రధాన కార్యదర్శి గా పంతం సతీష్ మాదిగ, పట్టణ టి ఏమ్మార్పిస్ యూత్ అధ్యక్షులు గా వళ్దాస్ అవినాష్ మాదిగ ను ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో టి ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.