Sunday , May 26 2024

కరాటే తో ఆత్మస్థైర్యం పెంపొందుతుంది

  • కరాటే లో సూర్యాపేటకు పేరు ప్రతిష్టలు తేవాలి
  • కరాటే విద్యార్థులకు బెల్టులు ప్రధానం చేసిన డిఎస్పి రవి

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా మార్చి 07 : విద్యార్థిని విద్యార్థులు కరాటే నేర్చుకోవడంతో ఆత్మస్థైర్యం పెంపదడమే కాకుండా ఆత్మ రక్షణకు పాటుపడుతుందని సూర్యాపేట డిఎస్పి రవి అన్నారు. సుమన్ షోటో ఖాన్ స్పోర్ట్స్ కరాటే డు అకాడమీ ఆధ్వర్యంలో సీనియర్ కరాటే మాస్టర్ జెవి రమణచే నాలుగు నెలల పాటు శిక్షణ పొందిన కరాటే విద్యార్థులకు గురువారం స్థానిక ఎం ఎస్ ఆర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారి ప్రతిభ ఆధారంగా బెల్టులు ప్రధానం చేసి మాట్లాడారు. కరాటే లో సూర్యాపేట విద్యార్థులు జాతీయస్థాయిలో రాణించాలన్నారు. బాలికలకు కరాటే ఎంతో అవసరమని ప్రతి ఒక్కరు కరాటే నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కరాటే శిక్షణ ఇవ్వడంతో పాటు విద్యార్థుల్లో ప్రతిభకు పదును పెడుతున్న కరాటే మాస్టర్ జెవి రమణను అభినందించారు. అనంతరం 50 మంది విద్యార్థులకు ఎల్లో బెల్టులు 6 మందికి ఆరంజ్ బెల్టులతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెస్సార్ పాఠశాల కరస్పాండెంట్ కొల్లు శ్రీనివాస్ రావు, కరాటే మాస్టర్ కిరణ్, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.