Sunday , May 26 2024

హైదరాబాద్ కు దీటుగా సూర్యాపేటలో ఆహార పదార్థాలు అందించడం అభినందనీయం

  • స్నాక్సో ఫుడ్ కోర్టును ప్రారంభించిన జిల్లా టిఆర్ఎస్ నాయకులు గండూరి కృపాకర్

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి మార్చి 06 : హైదరాబాద్కు దీటుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో వినగదారులకు ఆహార పదార్థాలు అందించడం అభినందనీయమని జిల్లా టిఆర్ఎస్ నాయకులు గండూరి కృపాకర్ అన్నారు బుధవారం విద్యానగర్లో స్నాక్సో ఫుడ్ కోర్టును ఆయన ప్రారంభించి మాట్లాడారు. శాండ్విచ్, పిజ్జా, బర్గర్, మిల్క్ షేక్ లు ఒకప్పుడు హైదరాబాద్ లో మాత్రమే లభించేవని ఇప్పుడు సూర్యాపేటలో మన కళ్ల ముందు ఏర్పాటు జరగడం ఆనందంగా ఉందన్నారు. స్నాక్స్ ఫుడ్ కోర్ట్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు భీమిరెడ్డి పవన్, లక్ష్మినారాయణ, బెజగం ఫని తదితరులు ఉన్నారు.