భాగ్యనగర్ రుచులను ప్రారంభించిన డి.ఎస్.పి రవి తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి మార్చి 06 : వినియోగదారులకు నాణ్యమైన చక్కని రుచితో ఆహారాన్ని అందించి వారి మన్ననలు పొందాలని అప్పుడే వ్యాపారం అభివృద్ధి చెందుతుందని డిఎస్పి రవి అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో శ్రీ భాగ్యనగర్ రుచులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. మహానగరాలకు దీటుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో వినియోగదారుల అభివృద్ధి మేరకు హోటల్లు ఏర్పాటు కావడం హర్షినీయమన్నారు. హోటల్లో పనిచేసే సిబ్బంది యాజమాన్యం ఎప్పటికప్పుడు పరిశుభ్రతను పాటిస్తూ వినియోగదారులకు నమ్మకమైన ఆహారాన్ని అందించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెద్దిరెడ్డి రాజా, పెద్దిరెడ్డి గణేష్, షఫీ ఉల్లా, పెద్దిరెడ్డి కళ్యాణ్, పెద్దిరెడ్డి మహేష్, బిషప్ దుర్గం ప్రభాకర్, బొలిషేట్టి మధు తదితరులు ఉన్నారు.