పిల్లలకు తప్పకుండ పల్స్ పోలియో చుక్కలు వేయించాలి.
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. కోటా చలం.
తెలంగాణ కెరటం సూర్యాపేటజిల్లా మార్చి 03 : పిల్లల నిండు జీవితానికి రెండు పల్స్ పోలియో చుక్కలు తప్పక వేయించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా . కోటాచలం అన్నారు. ఆదివారం స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో సహచర వైద్యులతో కలసి చిన్న పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2364 మందిని నియమించాని , 591 బూత్ లలో ద్వారా పోలియో చుక్కలు వేయడం జరిగిందని మొదటి రోజు 90 శాతం పూర్తి చేశామని అన్నారు. జిల్లాలో ని ఏరియా ఆసుపత్రుల తో పాటు పీహెచ్ సి లు, సబ్ సెంటర్స్ , ఇతర ప్రాంతాలలో నియమించిన బృందాలు పోలియో చుక్కలు అందించారని తెలిపారు. జిల్లా లో 27 మొబైల్ టెమ్స్ ఏర్పాటు చేసి మూడు రోజులు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ఈ నెల 5 వరకు ఉంటుందని పిల్లల తల్లిదండ్రులు 0..5 వయస్సు ఉన్న పిల్లలకు తప్పక పోలియో చుక్కలు వేయించుకోవాలని విజ్ఞప్తి చేసారు. జిల్లాలో 0..5 సంవత్సరాల పిల్లలు 92965 మంది ఉన్నారని, పిల్లలకు అంగవైకల్యం రాకుండా పోలియో చుక్కలు ఎంతో ఉపయోగ పడతాయని అన్నారు. జిల్లాలో 5 సంవత్సరాల పిల్లలకు మూడు రోజుల పాటు బస్టాండ్స్, ముఖ్య కూడళ్లు,అంగన్వాడీ కేంద్రాలు, నది పరివాహక ప్రాంతాలు, ఇంటింటి సర్వే ద్వారా పిల్లలకు పోలియో చుక్కలు తప్పకుండా అందించాలని బృందాలను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకులు డా . మురళీధర్ రెడ్డి, డిఐఓ డా. వెంకటరమణ, పిల్లల వైద్యులు తదితరులు పాల్గొన్నారు.