(తెలంగాణ కెరటం) మార్చి 03 సూర్యాపేట జిల్లా ప్రతినిధి.
అనంతగిరి మండల పరిధిలోని అమీనాబాద్ గ్రామంలో గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి బోనాలు పండగను మాజీ సర్పంచ్ ముత్తినేని కోటేశ్వరరావు. గోపతి వంశస్థులు. ఆధ్వర్యంలో యాదవ సంఘం పూజారి బత్తుల పెద్ద ఉప్పలయ్య గ్రామస్తులు ఆదివారం సందడిగా నిర్వహించారు. మహిళలు నెత్తిన బోనాలతో బయలుదేరి డబ్బుకు చప్పుళ్లతో ప్రధాన వీధుల గుండా అమ్మవారు ఊరేగింపుగా ఆలయానికి వెళ్లారు. గొర్రెపోతులు కోళ్లతో బోనాలు నైవేద్యాలు స్వామికి సమర్పించి చిన్న పెద్ద తేడా లేకుండా భక్తిశ్రద్ధలతో మొక్కలు చెల్లించుకున్నారు. ఆలయంవద్ద వివిధ సంస్కృతి కార్యక్రమాలు రికార్డింగ్ డాన్స్ లతో భక్తులను ఆకట్టుకునే విధంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సాదే కోటేశ్వరరావు, మాజీ ఉపసర్పంచ్ దేవపంగు కృష్ణ, గ్రామ పెద్దలు భక్తులు వివిధ వాదాలలో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు.