తెలంగాణ కెరటం సూర్యాపేటజిల్లా మార్చి 03 :విద్యార్థులు తన ఉపాధ్యాయులతో నిర్వహించుకునే ఆత్మీయ సమ్మేళనం ఓ మధురానుభూతిని మిగుల్చుతుందని గీతాంంజలి పాఠశాల కరస్పాండెంట్ మారోజు భారతి విజయ్ కుమార్ అభిప్రాయ పడ్డారు.2008-09 సంవత్సరపు విద్యార్థులు ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు.బాల్యంలో తల్లిదండ్రులు గురువులైతే విద్యాబోదనతో పాటు సమాజంలో మెలకువలను నేర్పేది ఉపాధ్యాయులని అన్నారు. పట్టుదలతో చదివిన ప్రతి ఒక్కరు నేడు మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారని చెప్పారు. మున్ముందు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇస్మాయిల్,ఊటుకూరి రవీందర్, దామళ్ళ యల్లయ్య,గంట యల్లయ్య,విజయ,నిర్మల,పూర్వక విద్యార్థులు వినయ్,అశోక్,ఖాలేద్ తదితరులు పాల్గొన్నారు.