Wednesday , July 24 2024

పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

అప్పుడే పుట్టిన పిల్లల నుండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు రెండు ‌పోలియో చుక్కలు వేయించాలి

45 వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా మార్చి 03 : మార్చి మూడు, నాలుగు, ఐదు తేదీలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట 45 వ వార్డు విద్యానగర్ నందు గండూరి జానకమ్మ వాటర్ ప్లాంట్ వద్ద ఏర్పాటు చేసిన పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ముఖ్య అతిధిగా పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అప్పుడే పుట్టిన శిశువుల నుండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ రెండు పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ‌ ఆశా కార్యకర్త విజయ, వెంకటేష్, కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.