Sunday , May 26 2024

చక్కని జీవితానికి రెండు చుక్కలు

  • తల్లిదండ్రులు పల్స్ పోలియోను సద్వినియోగం చేసుకోవాలి

పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 03 : చక్కని జీవితానికి రెండు పోలియో చుక్కలు ఎంతో ఉపకరిస్తాయని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆదివారం పట్టణంలోని 9వ వార్డు అంగన్వాడి కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. చిన్నారుల్లో వచ్చే అంగవైకల్య నివారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహించే ఫల్స్ పోలియో కార్యక్రమాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.మూడు రోజులపాటు నిర్వహించే ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో తల్లిదండ్రులు తమ ఐదేండ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. పోలియో రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని అందరూ అందులో భాగస్వాములు కావాలన్నారు.సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి సహకారం తో జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా వైద్యసేవలు అందుతున్నాయని అన్నారు. మహా నగరాలకు తీసిపోని విధంగా కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్న సూర్యాపేట పట్టణ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సేవలను ప్రజలంతా సద్వినియోగం చేసుకంటున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు అభివృద్ధి కమిటీ నాయకులు గుండగని నాగభూషణం, అంగన్వాడి టీచర్ జానకమ్మ,పద్మ, ప్రభావతీ,వైద్యసిబ్బంది, ఏఎన్ఎం వెంకట్ రమణ, ఆశా వర్కర్లు నిర్మల,గంగమ్మ ,అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.