Saturday , October 12 2024

ఘనంగా బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ వార్షికోత్సవం

తెలంగాణ కెరటం సూర్యాపేటజిల్లా మార్చి 1: సూర్యాపేట పట్టణంలో అరవై ఫిట్ల రోడ్డు నందు బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ లో గురువారం రాత్రి వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థిని విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు విద్యతో సమాంతరంగా అన్ని రంగాల్లో రాణించాలని పాఠశాల ప్రిన్సిపాల్ అనప్పరెడ్డి సాగర్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్, ఉపాధ్యాయులు, పిల్లలు,తల్లి దండ్రులు తదితరులు పాల్గొన్నారు.