- మెడివిజన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 25 : ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రుల ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను జర్నలిస్టులు సద్వినియోగం చేసుకొని అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు దండ శ్యామ్సుందర్ రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక పెన్షనర్స్ భవనంలో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు హైదరాబాదుకు చెందిన మెడివిజన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు జర్నలిస్టులు తమ హెల్త్ కార్డు ద్వారా ఎంత పెద్ద రోగమైన పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం పొందవచ్చు అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల ఆధ్వర్యంలో అందించే నాణ్యమైన వైద్యం పొందాలంటే ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మెడివిజన్ ఆసుపత్రి వైద్యులు రెహానా, సంతోష్, వాసు, ఆర్గనైజర్ ఖలీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.