Monday , September 16 2024

ఘనంగా జాతీయ మహిళా పొదుపు దినోత్సవం

తెలంగాణ కెరటం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి ఏప్రిల్ 15

పొదుపుతో సమాజ ప్రగతి …జాతీయ మహిళా పొదుపు దినోత్సవం ఏప్రిల్ 14 పురస్కరించుకొని ముఖ్యంగా ధర్మసాగర్ మండలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయ కుటుంబాలతో పాటు పూర్వ వరంగల్ జిల్లాలో వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న ప్రభుత్వ , ప్రైవేటు శాఖలలో వివిధ రంగాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయ కుటుంబాలు, మహిళలు ,పురుషులు లష్కర్ బజార్ పాఠశాలలో సమావేశమై ప్రారంభించుకున్నారు. ఈ సందర్భంగా ఆ సంస్థ అధ్యక్షులు స్వరూప మాట్లాడుతూ మహిళలు పొదుపు అలవాటు చేసుకుంటే వారి కుటుంబాలతో పాటు సమాజం కూడా అన్ని రంగాలలో ముందుకెళ్తుంది. డబ్బు పొదుపుతో పాటు నీరు ఆహారం విద్యుత్తు ఇలా అన్ని రంగాల్లో మహిళలు ఆదా చేస్తే చాలా ఆదాయాన్ని సమకూర్చుకున్నట్లే అన్నారు. సంస్థ కోశాధికారి సరళ కుమారి మాట్లాడుతూ మహిళల్లో ఆర్థిక అక్షరాస్యత పెరగడం వల్ల వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇవ్వడమే కాక ఇలాంటి పొదుపు సంఘాలతో సాంగీకరణ చెంది సభ్య కుటుంబాలు వారి వారి కష్టసుఖాలలో పాలుపంచుకోవడంతో స్వాంతన చేకూరుతుంది అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా విశ్రాంత అటవీ అధికారి కాజీపేట పురుషోత్తం మాట్లాడుతూ ప్రాంతమైన, సమాజమైన పురోగతి చెందాలంటే విజ్ఞానం , పర్యావరణం, ఆర్థికం, విరామ సమయ సద్వినియోగం ముఖ్యం అంటూ సభ్యులకు దిశా నిర్దేశం చేస్తూ సభ్యులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమం విజ్ఞాన , వినోదం మేలవింపులతో ధర్మసాగర్ ఉపాధ్యాయులు వసుమతి, ధర్మ ప్రకాష్ లు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహ కమిటీ సభ్యులు శ్రీనివాసరెడ్డి, విజయ వర్ధన్ రెడ్డి , శ్రీధర్ , విమల, రాజశ్రీ, దేవేందర్ రెడ్డి, ఉషా కృష్ణమూర్తి, రత్నాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.