Sunday , May 26 2024

అంబేద్కర్ జయంతిని జయప్రదం చేయండి

తెలంగాణ కెరటం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి ఏప్రిల్ 11

ఏప్రిల్14న జరుగు మహనీయుల జయంతుల “బ్లూ షర్ట్ – నీలి కవాతు మహా ప్రదర్శన” ను జయప్రదం చేయండి:- మైస ఉపేందర్ మాదిగ (ఎం హెచ్ పి ఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు ఏప్రియల్ 14న డా.బి.ఆర్.అంబేడ్కర్ జయంతి రోజున సాయంత్రం 4గం.ల నుంచి 6గం.ల వరకు డా.బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి 125 అడుగుల డా.బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహం వరకు డా.పిడమర్తి.రవి నాయకత్వంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో జరుగు “బ్లూ షర్ట్ – నీలి కవాతు”ను మహనీయుల జయంతుల మహా ప్రదర్శన ర్యాలిని జయప్రదం చేయాలని, అదేవిధంగా హైదరబాద్ లోనీ 125 అడుగుల విగ్రహం వరకు అత్యధికంగా ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ యువకులు విద్యార్థులు మహిళలు ప్రజలందరూ మరియు దళిత బహుజన ప్రజలు అనుబంధ సంఘాల నాయకులు వారి ప్రాంతాలలో డా.బి.ఆర్. అంబేడ్కర్ జయంతి ప్రదర్శనలు జరుపుకొని, పెద్ద,ఎత్తున హైదరాబాద్ జరుగు “బ్లూ షర్ట్ – నీలి కవాతు” మహనీయుల జయంతుల మహా ప్రదర్శన ర్యాలిలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.