Wednesday , July 24 2024

మందకృష్ణ మాదిగను విమర్శించే స్థాయి ఎవ్వరికీ లేదు

భారతదేశంలోనే గొప్ప ఉద్యమకారుడు మందకృష్ణ మాదిగ

గంగారపు శ్రీనివాస్ మాదిగ (ఎమ్మార్పీఎస్) రాష్ట్ర నాయకులు

తెలంగాణ కెరటం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి ఏప్రిల్ 19

ధర్మసాగర్ మండల కేంద్రంలోని (ఎమ్మార్పీఎస్) మండల పార్టీ కార్యాలయంలో చిలుక రాజు మాదిగ (ఎమ్మార్పీఎస్) మండల నాయకుని ఆధ్వర్యంలో మండల సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గంగారపు శ్రీనివాస్ మాదిగ (ఎమ్మార్పీఎస్) రాష్ట్ర నాయకులు మరియు బొడ్డు శాంతి సాగర్ (ఎమ్మార్పీఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి పాల్గొని మాట్లాడుతూ కొట్టే పద్మయ్య మందకృష్ణ మాదిగ పై మాట్లాడిన వాక్యాలను ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నము కొట్టే పద్మయ్య ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ ఏ వృత్తిలో నిలకడగా కొనసాగలేదు కొంత కాలం విలేఖరి అని, కొంత కాలం (టి ఎమ్మార్పీఎస్) అని, మరికొంత కాలం (టిఆర్ఎస్) పార్టీ అని , ప్రస్తుత పరిస్థితులల్లో మాదిగ హక్కుల దండోరా అని, మరియు కాంగ్రెస్ పార్టీ అని, కొత్త డ్రామా అడుతున్నావ్ జాగ్రత్త పద్మయ్య ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఒక 5000 లేదా 10000 మందితో ఒక సభ పెట్టి చూడు నీకు తెలుస్తది. గతంలో 100 రోజుల్లో వర్గీకరణ చేస్తానని చెప్పింది బిజెపి నాయకులు మాత్రమే అంతేకాని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పలేదు మొన్నటికి మొన్న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన (ఎమ్మార్పీఎస్) విశ్వరుప మహాసభకు ప్రధాని నరేంద్ర మోదీ (ఎమ్మార్పీఎస్) మీటింగ్ కు వచ్చి మీటింగ్ లో పాల్గొని ఒక దేశ ప్రధానమంత్రి హోదాలో నేను వర్గీకరణ చేస్తానని మాట్లాడి చెప్పడం జరిగింది. అందుకుగాను మందకృష్ణ మాదిగ బిజెపికి సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగినది. ఎస్సీ ల (ఏ బి సి డి) వర్గీకరణ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతున్నది అట్టి ప్రక్రియ కుడ తుది దశకు చేరుకున్నది. నీకు వాస్తవాలు తెలుసుకునే సోయి లేకపోతే తెలుసుకో కానీ ఇష్టం వచ్చినట్లుగ మందకృష్ణ మాదిగ పై విమర్శలు చేస్తే సహించేది లేదు విమర్శలు చేయడం తక్షణమే మానుకోవాలి కడియం శ్రీహరి వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడి బానిస బ్రతుకు బ్రతుకకు మందకృష్ణ మాదిగ పై అనుచిత వాక్యాలు చేస్తున్న కొట్టే పద్మయ్య ఖబర్దార్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు మంద కృష్ణ మాదిగ పై విమర్శలు చేసేవారు కృష్ణా మాదిగ కాలు బ్రోటన వేలుకు కూడా సరి తుగారు ఇంకొక్కసారి మందకృష్ణ మాదిగ పై వచ్చిరాని విమర్శలు చేస్తే జరుగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పుట్ట ప్రణయ భాస్కర్ (ఎమ్మార్పీఎస్) మండల నాయకులు , మట్టడ బాలస్వామి (ఎమ్మార్పీఎస్) మండల నాయకులు , మాచర్ల బాబు (వి హెచ్ పి ఎస్) మండల నాయకులు , బరిగాల ప్రదీప్ కుమార్ (ఎం ఎస్ ఎఫ్) మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.