Tuesday , July 16 2024

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

24 సంవత్సరముల తరువాత కలయిక

తెలంగాణ కెరటం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి మే 19

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంను హనుమకొండలో ఘనంగా జరుపుకున్న జనగామ గురుకుల పాఠశాల 2000 వ బ్యాచ్ 24 సంవత్సరముల తర్వాత కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తపరిచిన పూర్వ విద్యార్థులు ఈ సందర్భంగా నరసయ్య మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. స్కూల్ పిల్లల మారిపోయామని అని అన్నారు. విద్యార్థులుగా ఉన్న దశలోనే ఒక గోల్ ఏర్పరచుకొని బాగా కష్టపడి చదివి మంచి ఉన్నతమైన ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.