Wednesday , September 18 2024

కడియం కావ్య గెలుపే లక్ష్యంగా ప్రచారం

ముప్పారం కాంగ్రెస్ పార్టీ నాయకులు

తెలంగాణ కెరటం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి మే 4

ధర్మసాగర్ మండలంలోని ముప్పారం గ్రామంలో 22వ బూతులో జోరుగా సాగుతున్న ప్రచారం నియోజకవర్గ శాసనసభ్యులు కడియం శ్రీహరి నియోజకవర్గ ఇన్చార్జి సింగపురం ఇందిర ఆదేశాల మేరకు వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య చేతి గుర్తు కు ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని గడప గడపకు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారం లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చొక్కం యాదగిరి 22 వ బూత్ కన్వీనర్ చిట్యాల భరత్ ఆధ్వర్యంలో ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో గ్రామ కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచులు మాజీ ఎంపిటిసి లు, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.