Tuesday , July 16 2024

ఉమ్మడి మెదక్ జిల్లాలో సివిల్ సప్లై అధికారులు ఉన్నారా లేరా

రైస్ మిల్లులో వేల కోట్ల కుంభకోణం జరుగుతున్న

చూసి చూడనట్టుగా వదిలేస్తున్న అధికారులు

మెదక్ జిల్లా రామయంపేట. తూప్రాన్.చేగుంట. నార్సింగి. వెల్దుర్తి మండలాల్లో రైస్ మిల్లర్లు. సివిల్ సప్లై అధికారులు నిర్లక్ష్యం

తెలంగాణ కెరటం స్టేట్ క్రైమ్ ఏప్రిల్ 10

సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్యం ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఎన్నో వేల కోట్లు పెట్టి ధాన్యాన్ని సేకరించి అట్టి ధాన్యాన్ని మిల్లర్లకు కాళీ అగ్రిమెంట్ పేపర్ మీద ఇవ్వడం జరిగింది. కానీ సీఎంఆర్ చట్టంలో ప్రతి మూడు రోజుల కు ఒకసారి ప్రతి రైస్ మిల్లర్లకు వెళ్లి తనిఖీ చేయాల్సింది ఉంటుంది కానీ. ఏ ఒక్క అధికారి కూడా రైస్ మిల్లర్లు కు విసిట్ చేయలేదు ఇదే అదనంగా భావించి మిల్లర్లు తమ నచ్చిన విధంగా దాన్నని అమ్ముకోవడం జరిగింది. అధికారులు రైస్ మిల్లులను తనిఖీ చేసినట్లయితే ఈ అక్రమాన్ని అడ్డుకట్టుపడేది. దీనిలో అర్థం అయ్యేది ఏమిటి అంటే మిల్లర్లు అధికారులు కుమ్మకై ధాన్యాన్ని అమ్ముకోవడం జరిగింది . ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇట్టి అక్రమాలను ఆపగలరని ప్రజలు కోరుతున్నారు.