Wednesday , July 24 2024

శ్రీ రేణుక మాత ఆలయంలో శ్రావణ మాస ప్రత్యేక పూజలు

తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా: 29 ఆగష్టు 2023

యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం కైలాస పురంలోని శ్రీ రేణుక వాసవి బసవ లింగేశ్వర దేవాలయంలో శ్రావణ మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు అభిషేకం నిర్వహించారు. పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలేరు మున్సిపల్ కౌన్సిలర్ బేతి రాములు, ఉప్పల ప్రవీణ్ కళ్యాణి దంపతులు (యూఎస్ఏ ), ఐ వి ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు సరాబు సంతోష్ గుప్తా, జిల్లా గ్రంధాలయ డైరెక్టర్ ఆడేపు బాలస్వామి, పాశికన్టి శ్రీనివాస్ లు పాల్గొన్నారు. గజ్వేల్ మండలం బూరుగుపల్లి గ్రామ వాస్తవ్యులు ప్రముఖ గౌడ సంఘం నాయకుడు సర్దార్ పంజాల వెంకట్ గౌడ్ వివాహమ్ సందర్భంగా వారి తల్లి సోదరీమణులు పంజాల బాలలక్ష్మి నవనీత సామా ప్రశాంతి దంపతులు అమ్మవారికి కళ్యాణ ఆహ్వాన పత్రిక సారే చీర సమర్పించారు. ఆలయ అర్చక స్వామి డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులకు కీర్తిశేషులు పొద్దుటూరు ఈశ్వరయ్య మరియు కీర్తిశేషులు బిజ్జాల అంజమ్మ శివయ్య గారి జ్ఞాపకార్ధం ఐ వి ఎఫ్ యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షులు భువనేశ్వరి మాత కిరాణా జనరల్ అండ్ టెక్స్టైల్ రాఘవపురం అధినేత పొద్దుటూరు లక్ష్మీ రమేష్ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ యువజన ఉపాధ్యక్షుడు సర్దార్ పంజాల వెంకట్ గౌడ్, గజ్వేల్ పట్టణ ఆర్యవైశ్యుడు అనిల్ గుప్తా, గజ్వేల్ ప్రముఖ కొబ్బరికాయల వ్యాపారి గ్రంధం శ్రీనివాస్ దంపతులు , IVF నాయకులు ప్రముఖ ఆర్యవైశ్య నాయకుడు ఐ వి ఎఫ్ నాయకులు ప్రముఖ ఆర్యవైశ్య నాయకుడు బిజ్జాల విశ్వనాథం నిర్మల దంపతులు ఆర్యవైశ్య నాయకులు సముద్రాల శ్రీనివాస్, ప్రొద్దుటూరు రమేష్, ఆలేరు పట్టణ టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు బీజన బాలరాజు, తదితర భక్తులు పాల్గొన్నారు.