- పూజలకు హాజరైన బారాసా నాయకులు…
జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రంగా బాధితులను బర్దిపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో ఆదివారం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశ్రమ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ 108 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్, డాక్టర్ సిద్దేశ్వర స్వామి ఆధ్వర్యంలో కొనసాగుతున్న శత జయంతి ఉత్సవాల్లో భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాయికోడ్ జడ్పిటిసి సభ్యులు మల్లికార్జున్ పాటిల్, జహీరాబాద్, ఝరాసంగం బారాస మండల అధ్యక్షులు హుగ్గేల్లి రాములు యాదవ్, మఠం రాజయ్య స్వామి తదితరులు రుద్ర సహిత దత్త యజ్ఞం, పూర్ణాహుతి, మహా మంగళహారతి కార్యక్రమాలకు హాజరయ్యారు. వారికి ఆశ్రమ పీఠాధిపతులు పూలమాల శాలువాలతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా శతజయంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి