Tuesday , July 16 2024

శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్ లో పిల్లలను చేర్పించకండి.

విద్యార్థి,యువజన,ప్రజా,ఉపాధ్యాయ సంఘాలు 

తెలంగాణ కెరటం మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా బ్యూరో,

మక్తల్ లో శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాలలో తల్లిదండ్రులు విద్యార్థులను చేర్పించకండి అని విద్యార్థి, యువజన, ప్రజా ,ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి పిడిఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి భాస్కర్ అధ్యక్షత వహించగా విద్యార్థి ,యువజన ,ప్రజా ,ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడడం జరిగింది
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మక్తల్ కేంద్రంలో శ్రీ చైతన్య పాఠశాలను ఏర్పాటు చేసి మేము విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తామని అంటున్నారు అయితే ఇప్పటివరకు ఎటువంటి అనుమతులు లేకుండా అబద్దాలు అసత్యాలతో ప్రచారాలు నిర్వహిస్తున్నారు అయితే ఇప్పుడు నిర్వహించే ఆ పాఠశాలలో గతంలో డిగ్రీ కాలేజీ కొనసాగుతున్న ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం పాఠశాల ఏర్పాటు చేయాలంటే అన్ని రకాల బస్సులతో కూడిన ప్రదేశాలలో చేయాలని ఉంది అయితే ఏమాత్రం ప్రభుత్వానిబంధనలను పాటించకుండా బ్యానర్లు కట్టి అసత్యాలు ప్రచారం చేసి విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
ఒక నర్సరీ స్టాండర్డ్ కి సంవత్సరానికి 50వేల రూపాయలు ఫీజులు కట్టాలి అంటున్నారు ఎందుకంటే ఆ పిల్లలకు నీటు జేఈఈ ఇలాంటి కోచింగ్లు ఇస్తామని చెబుతూ ఫీజులు దండుకుంటున్నారు ధనార్జన దేయంగా విచ్చలవిడిగా ఫీజులను వసూలు చేస్తూ విద్యార్థులను మానసికంగా అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం అధికారులు ఇట్లా అబద్ధం ప్రచారాలు చేసే శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేనియెడల మా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర బాధ్యులు మద్దిలేటి, డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ బాధ్యులు హైమావతి, టీఎస్ యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటస్వామి, అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు భగవంతు, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పృథ్వీరాజ్, పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్, ఎమ్మార్పీఎస్ నాయకులు నగేష్, కే ఎన్ పి ఎస్ నాయకులు విజయ్, బేడ బుడగ జంగం సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కళ్యాణం రాజ్, పిడిఎస్యు జిల్లా నాయకులు అజయ్ ,శేఖర్ ,రమేష్ తదితరులు పాల్గొన్నారు