–కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్
–ఆత్మ కమిటీ మాజీ డైరెక్టర్ శ్రీరామ్ నరేందర్
తెలంగాణ కెరటం:(దుబ్బాక)మార్చి15:
పద్మశాలిల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ అన్నారు.శుక్రవారం రోజున స్థానిక దుబ్బాక పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,స్వర్గీయ ముత్యం రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, మాజీ వివర్ సెల్ అధ్యక్షులు గూడూరు శ్రీనివాస్ ఈ ప్రాంతంలో ఉన్న పద్మశాలిల గురించి అధ్యయనం చేయించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారని పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో కీలక బాధ్యత వ్యవహించారని వారు తెలిపారు.పద్మశాలీల అనేక సంవత్సరాల కల పద్మశాలి కార్పొరేషన్ అని వారు తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినఅనాది కాలంలోనే పద్మశాలీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు.రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నపద్మశాలీల అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అనంతుల శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ యూత్ జనరల్ సెక్రెటరీ ఆకుల భరత్, మంద శీను,మట్ట కిషన్ రెడ్డి,ఆడపు దుబ్బయ్య,మెతుకు ప్రభాకర్,ఎల్లారం రవి, దావనపల్లి రవి, వడ్లకొండ రమేష్,జిందం మల్లేశం,దుద్దెడ శేఖర్,బిల్ల బాలరాజు,బిల్లా రాములు, తదితరులు పాల్గొన్నారు.