Tuesday , July 16 2024

నక్సలైట్ల పేరుతో బ్యానర్ కట్టి, గోడకు రాసిన ఇద్దరి నిందితులను అరెస్టు చేసిన తొగుట పోలీసులు

తెలంగాణ కెరటం సిద్దిపేట జిల్లా క్రైమ్ ప్రతినిధి .మార్చ్ 14

ఈమధ్య గత కొద్దీ రోజుల కిందట తొగుట మండలం పెద్ద మాసంపల్లి గ్రామంలో హేట్రో ( హానర్ ఇన్ఫ్రా ఎస్టేట్స్ లిమిటెడ్ హైదరాబాద్) వారికి సంబంధించిన భూమిలో నక్సలైట్ల పేరు మీద గోడలకు సిపిఐ మావోయిస్టు అని రాయడం జరిగింది. అదే రోజు పెద్ద మాసంపల్లి గ్రామ శివారులో పన్యాల ఎల్లారెడ్డి వ్యవసాయ భూమి వద్ద సిపిఐ మావోయిస్టు పేరు మీద ఒక బ్యానర్ కూడా కట్టడం జరిగింది. ఇట్టి కేసు విషయంలో తొగుట మండలం పెద్ద మాసంపల్లి మధిర గ్రామమైన ఇందిరానగర్ గ్రామానికి చెందిన బోనాల రాజు @ గగన్ తండ్రి బాల నరసయ్య వయసు 34 సంవత్సరాలు కులం ముదిరాజు వృత్తి కార్ డ్రైవర్ అనునతనికి వారి గ్రామ శివారులో ఆరు ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా అందులో నాలు ఎకరాల 23 గుంటల భూమిని హెట్రో కంపెనీకి 2014 సంవత్సరంలో అమ్మి నాడు. మిగతా ఒక ఎకరం భూమిలో వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు అట్టి ఎకరం భూమికి ఎటువంటి కాగితాలు లేవు అట్టి ఎకరం భూమిలో తన తల్లి వ్యవసాయం చేస్తూ జీవిస్తుంది ఈ మధ్యకాలంలో అట్టి కంపెనీ వారు వారి భూమి చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నారని తెలిసింది అలా వేయడం వల్ల అట్టి రాజు వాళ్ళకు ఉన్న ఎకరం భూమి కూడా అందులో పోతుంది అని ఆ విషయమే చాలాసార్లు అట్టి కంపెనీ వారితో మాట్లాడిన గాని వారు రాజు మాటలకు స్పందించకపోయేసరికి చాలా రకాలుగా వారితో మాట్లాడాలని ప్రయత్నించినాడు అయినప్పటికీ అటు కంపెనీ వారు స్పందించకపోయేసరికి ఏదో రకంగా పట్టి కంపెనీ వారిని భయపెట్టాలని ఉద్దేశంతో అతని స్నేహితుడు మహారాష్ట్రకు చెందిన యాష్ అజయ్ మహత్ తండ్రి అజయ్ మహత్ వయసు 24 సంవత్సరాలు, అతనికి తన యొక్క బాధను మొత్తం చెప్పి ఏదో రకంగా టి కంపెనీ వారిని భయపెట్టాలని చెప్పి వారు ఇద్దరూ అనుకున్నారు అందులో భాగంగా ఎన్ని రకాలుగా వారితో మాట్లాడాలని చూసిన ఫలితం లేకపోయేసరికి మావోయిస్టులమని చెప్పి భయపెట్టిస్తే వారు భయపడి రాజుకు ఉన్న తన ఎకరం భూమి తనకు ఇస్తారని చెప్పి అనుకున్నాడు అందులో భాగంగా తేదీ 09.03.2024 నాడు మధ్య రాత్రి 12 గంటలకు రాజు మరియు అతని స్నేహితుడు యాష్ అజయ్ మహత్ కలిసి రాజు యొక్క చెల్లెలి యొక్క యాక్టీవ్ బండి పైన హైదరాబాద్ నుండి పెద్ద మాసంపల్లి గ్రామానికి వచ్చి గ్రామ శివారులో పన్యాల ఎల్లారెడ్డి వ్యవసాయం వద్ద ముందుగా ఎర్ర రంగు బ్యానర్ను కట్టినారు తదనంతరం కంపెనీ భూమిలో గల సెక్యూరిటీ రూమ్ వద్దకు వెళ్లి వెంట తెచ్చుకున్న కలర్ డబ్బాలతో అట్టి గోడలపై మావోయిస్టు హెచ్చరిక అని రాసినారు . ఈరోజు తేదీ 14.03.0204 నాడు రాజు మరియు అతని స్నేహితుడుయాష్ అజయ్ మహత్ అదే యాక్టివా బండి పైన తొగుటకు వస్తుండగా తొగుట SI గారు సిబ్బంది కలసి వారిని పట్టుకొని విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు వారి వద్ద నుండి సెల్ ఫోను యాక్టివా బండిని సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా పెద్ద మాసం పల్లి గ్రామంలో కట్టిన ఎరుపు రంగు జెండాను సెక్యూరిటీ రూమ్ వద్ద పడేసిన కలర్ డబ్బాను బ్రష్ ను రాజు యొక్క ఇంటి వద్ద నుండి అతను ఆరోజు వేసుకున్న టువంటి డ్రెస్సును మరియు తన ఇంట్లో గల తెలుపు రంగు కలర్ డబ్బా అని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఇద్దరి నిందితుల్ని తొగుట ఎస్ఐ అరెస్టు చేసి జ్యుడిషియల్ డిమాండ్ కు పంపించడం జరిగిందనీ తెలిపారు .