Wednesday , July 24 2024

యువత మేలుకో బంగారు భవిష్యత్తు మేలుకో

పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ

తెలంగాణ కెరటం సిద్దిపేట జిల్లా క్రైమ్ ప్రతినిధి. మార్చ్ 3

*గంజాయి సేవించి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు
తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను ప్రతిరోజు గమనించాలి,లేదంటే దుఃఖ సాగరంలో మునిగిపోతారు
గంజాయి ఇతర మాదకద్రవ్యాలను రూపుమాపడంలో ప్రతి ఒక్కరం భాగస్వాములు అవుదాం
గంజాయి ఇతర మత్తుపదార్థాల రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మేడం గారు గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నియంత్రణ, వాటి నివారణకు తీసుకోవాల్సిన అంశాల పైన మాట్లాడుతూ….సైన్స్ అండ్ టెక్నాలజీలో దూసుకుపోతున్న సమాజంలో
గంజాయి సరఫరా,విక్రయాలు చేసే నేరస్తులు కూడా కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వెలుగు చూస్తున్న గంజాయి చాక్లెట్ల కలకలం అని అన్నారు. ఆకు, సిగరెట్లు, పొడి, లిక్విడ్ రూపంలో గంజాయి రవాణా, అమ్మకాలు చేసే మాఫియా… దానిని ఇప్పుడు చాక్లెట్ల రూపంలోకి కూడా మార్చి చిన్న పిల్లలను సైతం గంజాయికి బానిసలుగా మార్చుతోందని చెడు వ్యసనాలకు బానిసలుగా మారిన కొంతమంది యువత బలహీనతను ఆసరగా తీసుకుని గంజాయి మాఫియా రెచ్చిపోతుందని ఇంతకు ముందు వరకు గంజాయి, డ్రగ్స్ ప్రస్తుతం మారుమూల ప్రదేశాలలో చిన్న చిన్న ఊళ్ళకూ కూడా పాకుతుండండతో… అది కూడా చిన్న పిల్లలు తినే చాక్లెట్ల రూపంలో అమ్ముతుండడం మనకు విదితమే అని గంజాయి చాక్లెట్టు ఇంతలా విస్తరించడం, అలాగే పిల్లలకి చాక్లెట్లు అనగానే ఇష్టంగానే తింటారని..వారికి అసలు గంజాయి అంటే ఏంటో కూడా తెలియదని అలాంటి పిల్లలు,విద్యార్ధుల అమాయకత్వం లక్ష్యంగా సూళ్ళ దగ్గర ఉండే పాన్ షాపుల్లో దందాను యధేచ్చగా నిర్వహిస్తున్నారని దేశ భవిష్యత్తును నిర్ణయించే యువత గంజాయి, మత్తుపదార్థాల బారిన పడకుండా వారి భవిష్యత్తు దృష్ట్యా మత్తు పదార్థాలు సరఫరా, ఉత్పత్తి చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపి వాటిని విద్యార్ధులు, యువతకు దూరం చేయాలనే లక్ష్యంగా జిల్లా పోలీసు వారు పనిచేస్తున్నారని తెలిపారు. విద్యార్థులు యుక్త వయసులో విద్యాబుద్ధులు నేర్చుకుని, ఉన్నత విద్య , ఉద్యోగాలు సాధించాల్సిన యువత గంజాయికి అలవాటు పడి తమ బంగారు భవితను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. కుటుంబానికి, గ్రామానికి మంచి పేరు తెస్తారని తల్లిదండ్రులు కలలు కంటుంటే వీరు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడుతూ చోరీలకు పాల్పడుతూ, ఇతరుల పై దాడులు చేస్తూ ప్రమాదాలకు పాల్పడడం, ప్రేమ వ్యవహారాలు తదితర కారణాలే కాకుండా తల్లిదండ్రులను డబ్బులు అడగడం ఇవ్వకపోతే దాడులు చేస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.గంజాయి కి బానిసలుగా మారిన యువకుల శరీరాకృతి సైతం మారిపోయి మానసిక రోగులుగా విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. తొలి దశలో గుర్తించలేని తల్లిదండ్రులు ఆలస్యంగా తెలుసుకొని తమ పిల్లలకు కౌన్సిలింగ్ లు ఇప్పిస్తూ మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.అలాగే గంజాయి వాడే వారి మానసిక ప్రభావాలు మరింత స్పష్టంగా మరియు తీవ్రంగా మారతాయి. మరియు వారిలో ఆందోళన, నిరాశ, మానసిక స్థితిలో విపరీతమైన మార్పులు, మతిస్థిమితం మరియు మానసిక స్థితి వంటివి ఉంటాయి. అలాగే గంజాయి వాడే వారి కళ్ళు ఎర్రబడటం, నోరు పొడిబారడం మరియు మగతగా ఉండటం, జ్ఞాపకశక్తి తగ్గడం, బలహీనమైన శరీరాకృతి, హృదయ స్పందన రేటు పెరగడం మరియు తీవ్రమైన వికారం మరియు వాంతులు ఉంటాయి. కాబట్టి యువత పక్కదారి పడుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా లేకపోతే అనేక ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఉన్నాయి. పిల్లల తల్లిదండ్రులు వారి ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. తమ పిల్లలు కాలేజీలకు వెళ్తున్నారా లేదా, ఎవరితో తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అనే అంశాలపై దృష్టి సారించాలి. లేదంటే పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని పిల్లల ప్రవర్తనలో ఏమాత్రం తేడా కనిపించినా తల్లిదండ్రులు అప్రమత్తం కావాలని వెంటనే పోలీస్ వారికి తెలియజేయాలని తల్లిదండ్రులు సకాలం లో గుర్తించి పిల్లల భవిష్యత్తును దేశ భవిష్యత్తును కాపాడాలని అన్నారు. ఈ విషయం గురించి ప్రజల్లో మెరుగైన చైతన్యం కొరకు పోలీసు కళాబృందం వారిచే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అభివృద్ధికి అవరోధంగా మత్తు పదార్థాలు లేకుండా చేయ వలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కావున ప్రతి వ్యక్తి మాదకద్రవ్యాలకు సంబందించి ఎటువంటి సమాచారం ఉన్న తమ వంతు భాద్యతగా వెంటనే మెదక్ జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్‌ 8712667100, జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారుల కు
సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.