తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి ఫిబ్రవరి 17,
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల ఎర్రవల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 70వ జన్మదినం సందర్భంగా ఎర్రవల్లి గ్రామంలో ఆయన పేరు మీదుగా ఆయుష్ హోమం ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఈ సందర్బంగా ఈ ముఖ్య అతిధులుగా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి,వంటేరు ప్రతాప్ రెడ్డి లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ భాగ్య బిక్షపతి, ఎంపీటీసీ ధనలక్ష్మి కృష్ణ, ప్యాక్స్ వైస్ చైర్మన్ బాలరాజు ,గ్రామ పార్టీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, యువకులు ప్రభాకర్, రాజు, రామచంద్ర రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, కుంట కర్ణాకర్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.