తెలంగాణ కెరటం సిద్దిపేట జిల్లా క్రైమ్ ప్రతినిధి
*నేరస్తుని వివరాలు
బొల్లిపల్లి విజయ్ భాస్కర్ రెడ్డి తండ్రి భూమిరెడ్డి, వయస్సు 34 సంవత్సరంలు, గ్రామం పెద్దకోడూర్, మండలం చిన్నకోడూర్*
టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ కేసు యొక్క వివరాలు తెలియపరుస్తూ పై నేరస్తుడు ధర్మారం రాజిరెడ్డి, కూతురుకు మంచి మెడికల్ కాలేజీలో సీటు ఇప్పిస్తానని రెండు మూడు దఫాలుగా రెండు లక్షల రూపాయలు తీసుకుని మెడికల్ కౌన్సిల్ పర్మిషన్ లేని టిఆర్ఆర్ మెడికల్ కాలేజీలో కౌన్సిలింగ్ ఉన్నదని నమ్మించి మోసం చేసినాడు. తరువాత డబ్బులు ఇవ్వమని అడగగా ఫిర్యాదుకి డబ్బులు ఇవ్వనందున అతడు కోర్టులో కేసు వేసినాడు. అప్పటి ఎస్ఐ వరప్రసాద్ కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించి నేరస్తుని అరెస్టు చేసి జుడిషల్ రిమాండ్కు పంపించడం జరిగిందనీ
ఆరోజు నుండి ఈరోజు వరకు సిద్దిపేట అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు లో కేసు విచారణ జరిగిందనీ. ఈరోజు మెజిస్ట్రేట్ ఇరువురి వాదనలు విన్న తర్వాత నేరస్తుని పై నేరం రుజువైన అందున నేరస్తునికి 1 సంవత్సరం జైలు శిక్ష, మరియు 1000/- రూపాయల జరిమానా విధించారు.
నేరస్థునికి జైలు శిక్ష పడడానికి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ యం. రూప తన వాదనలు వినిపించారు, కోర్టు కానిస్టేబుల్ స్వామి, శరత్, కోర్టు లైజనింగ్ హెడ్ కానిస్టేబుల్ రాజమల్లు కీలక పాత్ర వహించారనీ.
ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ కేసు ఇన్వెస్టిగేషన్ పోలీస్ అధికారులను మరియు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను అభినందించారు.