Saturday , October 12 2024

ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించిన ఎంపీడీవో ప్రవీణ్

తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి ఫిబ్రవరి 09,

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో చేపట్టిన ఉపాధి హామీ పథకం ద్వారా చేస్తున్న పనులను మరియు ఎంపీడీవో ప్రవీణ్,ఉపాధి హామీ పథకం ఈసీ రాజు, శుక్రవారం ఈజీఎస్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీలకు పని చేసినంత వేతనం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఉపాధి హామీ పథకం కూలీలందరూ ఇంత ఎక్కువ పని చేస్తే అంత ఎక్కువ డబ్బులు వస్తాయని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి సిద్దేశ్వర్, ఫీల్డ్ అసిస్టెంట్ లలిత, ఉపామి ఉపాధి హామీ పథకం కూలీలు తదితరులు ఉన్నారు.