రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ కెరటం ప్రతినిధి ఆగస్టు
ఇటీవల సివిల్ ఎస్సైగా ఎంపికైన వేములవాడ పట్టణానికి చెందిన కొప్పుల స్వాతిని వేములవాడ జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గురువారం టియుడబ్ల్యూజే హెచ్ 143 ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మొహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో జర్నలిస్టులు స్వాతిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం మహమ్మద్ రఫీ మాట్లాడుతూ పట్టణానికి చెందిన స్వాతి తమ తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎంతో కష్టపడి చదివి ఎస్సై గా ఎంపిక కావడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు
నేటి యువతీ,యువకులు స్వాతిని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్ లో ఉన్నతంగా రాణించాలని తెలిపారు.
కష్టం,కన్నీళ్ళ విలువ తెలిసిన స్వాతి న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉండాలని కోరారు.పోలీస్ శాఖలో ఎస్సై గా ఎంపికైన తనను సన్మానించి అభినందనలు తెలిపిన జర్నలిస్టులకు స్వాతి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ముఖ్య సలహాదారులు సయ్యద్ రసూల్, కనక రెడ్డి, ప్రధాన కార్యదర్శి సయ్యద్ అలీ,ఉపాధ్యక్షులు నేరెళ్ల కమలాకర్,ఆర్గనైజ్ సెక్రెటరీ వేణు, సంతోష్, శ్రీకాంత్ లు పాల్గొన్నారు.