శివనామస్మరంతో మారుమోగిన ఆలయలు
ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు
తెలంగాణ కెరటం, యాచారం, మార్చ్
మహాశివరాత్రి పండుగ సందర్భంగా యాచారం మండలంలోని నందిగానపర్తి గ్రామంలో శ్రీశ్రీ నందీశ్వర మహాక్షేత్రం, సిద్దేశ్వర ఆలయంలో పార్వతి పరమేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఆలయ ధర్మకర్త ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.వేదపండితుల మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోకంగా కళ్యాణాన్ని కమణీయంగా జరిపించారు. శివరాత్రి సందర్భంగా మాజీ ఎంపీపీ రాచర్ల లక్ష్మి కళ వెంకటేశ్వర్లు నందీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.అలాగే సిద్దేశ్వరాలయంలో బి.ఎన్.రెడ్డి ట్రస్ట్ చైర్మన్ బిలకంటి శేఖర్ రెడ్డి దంపతులు శివపార్వతులకు కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించి, శివ పార్వతి కళ్యాణం కొరకు శివపార్వతుల విగ్రహాలను ఆలయం నుండి డప్పు వాయిద్యాలతి ఊరోగింపు కళ్యాణమండపం తీసుకురాగా కళ్యాణం మహోత్సవంలో శివపార్వతుల కళ్యాణం వేద మంత్రాలతో అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణానంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.పెద్ద ఎత్తున హాజరైన భక్తుల మధ్య శివపార్వతుల కల్యాణం కనులపండువగా జరిగింది. వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆనందంగా శివపార్వతులకళ్యాణం ని వీక్షించారు.ఈ కార్యక్రమంలోమాజీ ఎమ్మెల్యే ముదిరెడ్డి సావిత్రమ్మ కోదండ రెడ్డి,మాజీ సర్పంచ్ కంబాలపల్లి ఉదయశ్రీ రవీందర్ రెడ్డి, మూడేళ్ల వెంకట్ రెడ్డి,కాళ్ల జంగయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు నెర్రె శ్రీశైలం, షాహిద్,నేర్రె బాషా,నక్క మహేందర్, పాలమొని రామకృష్ణ, తెలగమల్ల ప్రశాంత్,
ముచ్చర్లయాదగిరి,శివలింగం,ముక్తాల శివకుమార్,మహేందర్, కొంగరిచంటి, కొండాపురం పాండు, సుధాకర్ రెడ్డి,నూకం మహేందర్, వెంకట్ రమణ,గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.