Wednesday , September 18 2024

మాలోత్ తాండ లో సేవాలాల్ మహారాజ్ ఘనంగా జయంతి వేడుకలు.

లింగంపేట్ మండలం:- ( ఫిబ్రవరి 15)
మాలోత్ తండా లొని సేవాలాల్ జయంతి సందర్బంగా ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది.జయంతి సందర్బంగా సర్పంచ్ మాలోత్ సునీత ప్రకాష్ నాయక్ అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం జరిగింది. తండాలోని నాయక్,ఖారోభార్, తాండ ప్రజలు సేవాలాల్ , జగజాంబ, భక్తులు నైవిద్యం సమర్పించి బోగ్ బండర్ చేయడం జరిగింది. ఈ జయంతి కార్యక్రమంలలో డీజే లతో ఆటపాటలతో ఊరేగింపుగా ఆనందంతో బంజారాల శాంతియుత జీవన మార్గంలో నడిపిన జన జాగృతి, చేసిన మహానుభావుడు, గురువు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285 వ జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాండ నాయక్ చందర్, ఫుల్ సింగ్, వసరం నాయక్, తాండ ప్రజలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది.