Monday , September 16 2024

స్నేహితుని జ్ఞాపకార్ధంగా వృద్ధాశ్రమానికి 50 కిలోల  బియ్యం విరాళం

తెలంగాణ కెరటం చెన్నూర్ ప్రతినిధి ఆగస్టు 6:

జైపూర్ మండలం రసూల్ పల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు ఆయన జ్ఞాపకార్ధంగా తోటి మిత్రులు సాయి దృష్టి అంధుల  వయోవృద్ధుల ఆశ్రమానికి  50 కేజిల రైస్ బ్యాగ్ ఫ్రూట్స్ విరాళంతో పాటు  అన్నదానం కార్యక్రమం చేశారు. ఈ మేరకు తోటి స్నేహితులు మాట్లాడుతూ రాజశేఖర్  మా మధ్య లేకపోయినా వారి  జ్ఞాపకాలు ఎప్పుడూ మా మదిలోనే ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకున్నారు.