శాస్త్రవేత్తలకి అంతుచిక్కని మహాభారతం టెక్నాలజీ
స్టేట్ ప్రతినిధి జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ సెక్రటరీ వడ్డేపల్లి హనుమంతు
శాస్త్రవేత్తలకి అంతుచిక్కని మహాభారతం టెక్నాలజీ స్టేట్ ప్రతినిధి జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ సెక్రటరీ వడ్డేపల్లి హనుమంతు స్టేట్ ప్రతినిధి సిద్దిపేట, మార్చి 1 ( తెలంగాణ కెరటం న్యూస్ ) : మహాభారత ఇతిహాసం వ్యాసుడు రచించి 5000 ఏళ్ళు అయిందని కొందరు చరిత్రకారులు చెప్తుంటారు. 5000 ఏళ్ళ క్రితం ప్రపంచంలో చాలాచోట్ల అసలు భాష లేదు, లిపి లేదు. అలాంటి సమయంలో ఇప్పటికీ సాధ్యం కాని విధంగా అంత గొప్ప గ్రంథాన్ని రచించడం దైవ సంకల్పం తప్ప ఇంకోటి కాదు. మహాభారతాన్ని మించిన ఇతిహాసం, అంత గొప్ప సాహిత్యం మరొకటి రాలేదు. ఇంత ఆధునిక ప్రపంచంలో కూడా 5వేల ఏళ్ళ క్రితం రచించిన సాహిత్యాన్ని మించినది రాకపోవడం ఆశ్చర్యం. విచిత్రం ఏంటంటే, ప్రపంచంలోనే ఇలాంటి గొప్ప సాహిత్యం ఇప్పుడు వరకు రాలేదు. భారతం అప్పటి చరిత్రను చెప్పే సాహిత్యం మాత్రమే కాదు, ఇప్పటికీ అంతు చిక్కని ఎన్నో సైన్సు సంగతులను చెప్పింది. ఇప్పటికీ మహాభారతం గురించే చర్చ జరుగుతోంది. భారతంలో ఉన్నవి నిజమా? కల్పనా ?అన్నది పక్కన పెట్టండి. ఒకవేళ ఆ టెక్నాలజీ ఊహే అయినా గాని, అద్భుతమే కదా ఏ ఇన్వెన్షన్ అయినా ఊహల నుంచి ఆలోచనల నుంచే పుడుతుంది. మహాభారతం కల్పన అని చెప్పేయడం కాదు. అందుకు ఆధారాలు కూడా చూపించగలగాలి. మనకు తెలియని ప్రతి విషయాన్ని కల్పన అనేయడం చాలా ఈజీ. మహాభారతంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. విదేశీయులు వాటి మీద రీసెర్చ్ చేసి, కొన్ని అద్భుతమైన అంశాలను మనకు అందించారు. అవేమిటో చూద్దాం. భారతంలో ఆదిపర్వంలోనే ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ముఖ్యంగా ధృతరాష్ట్రుడు, పాండురాజుల పుట్టుక. వ్యాసుడు నియోగ ధర్మం ద్వారా అంబికా అంబాలికలకు కనడం. వ్యాసుడిని చూసి భయపడి కళ్ళు మూసుకున్న అంబికకు అంధుడైన దృతరాష్ట్రుడు పుట్టాడు. అంబాలిక పాలిపోవడం వల్ల ఆ రంగుతోనే పాండురాజు పుట్టాడు. అంబాలిక దాసిని పంపిస్తే ఆ దాసికి ధర్మపరుడైన విదురుడు పుట్టాడు. ఇందులో సైన్సు ఏముంది? అనిపించవచ్చు. ముగ్గురికి మగ పిల్లలే పుట్టారు. వ్యాసుడు అదెలా నిర్ణయం చేయగలిగాడు? 1974లో అమెరికా అయోవా యూనివర్సిటీలో డోనాల్డ్, లాకే అనే ఇద్దరు సైంటిస్టులు ఇదే విషయంపై పరిశోధన చేశారు. స్త్రీ పురుష సంభోగ సమయంలో వారి మానసిక ఆవేశాలే బిడ్డ లింగ నిర్ణయంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని వారు చెప్పారు. అంబికా అంబాలిక మానసిక స్థితులు వల్లే వారికి మగ బిడ్డలు పుట్టారు. మానసిక సంక్షోభం ఎక్కువగా ఉన్నప్పుడు, సంభోగ సమయంలో స్పెర్మ్ కణాల్లో వైక్రోమోజం ఉన్న వీర్యకణాన్ని అండం ఆకర్షిస్తుందని సైన్స్ చెప్తోంది. కురువంశానికి అప్పటికి రాజు అవసరం కాబట్టి, వ్యాసుడు అలాంటి పరిస్థితిని అంబికా అంబాలికలకు సృష్టించాడని అనుకోవచ్చు. అంతేకాదు,, ఈనాటి స్పెర్మ్ డొనేషన్, ఆనాటి నియోగ పద్ధతి ఒకేలా కనిపిస్తాయి. ఆ తర్వాత కౌరవుల జననం మహాభారతానికే హైలెట్. కుంతి కన్నా ముందే తనకు బిడ్డ పుట్టాలని గాంధారి అనుకుంది. అది జరగలేదు. ఆవేశంతో గాంధారి గర్భం మీద కొట్టుకుంటే, గర్భంలో ఉన్న పిండం కింద పడింది. వ్యాసుడు వచ్చి, కింద పడిన మాంస ఖండాన్ని నూటొక్క భాగాలు చేసి, ఘృతబాండాల్లో సంరక్షించాడు. ఆ కుండల్లో ఆవు నెయ్యి నింపి మాంస ఖండాలను ఓ పద్ధతి ప్రకారం దాచి, వాటిని పెంచాడు. ప్రతిరోజు ఓ నిర్ణీత సమయంలో గాంధారిని ఆ నూటొక్క కుండలను తాకమని చెప్పాడు. మాతృత్వ వాత్సల్య స్పర్శ వల్లే ఆ కుండల్లో అండాలు మాతృగర్భం బయట కూడా పెరిగాయి. నెలలు నిండాక దుర్యోధనుడు మిగిలినవారు పుట్టారు. ఈ విధానాన్ని కొందరు సైంటిస్టులు మూడు రకాలుగా విభజించారు. ఒకటి, పిండాలని ముక్కలు చేయడం. మెడికల్ భాషలో స్లైసింగ్ ఎంబ్రియో. రెండోది, తల్లి గర్భాన్ని పోలిన కొత్త వాతావరణాన్ని సృష్టించి పిండాలను పెంచడం. ఆర్టిఫిషియల్ యూటర్నస్. మాతృ స్పర్శ కల్పించడం. మదర్ టచ్. వ్యాసుడు 100 ఖండాలుగా ఎందుకు చేశాడంటే, కనీసం ఒక్క ఖండంలోనైనా జీవకణం ఉంటే, ఒక కొడుకైన పుడతాడని. కానీ, వ్యాసుడు దైవ మహిమ వల్ల 100 మంది కొడుకులు పుట్టారు. ఇప్పటికీ చేతిచలవ అంటుంటాం కదా. అలాంటిదే అనుకోవచ్చు. అయితే, ఇప్పటివరకు గర్భాశయాన్ని పోలిన ఆర్టిఫిషియల్ గర్భాశయాన్ని వైద్యశాస్త్రం కూడా నిర్మించలేకపోయింది. కానీ, ఆనాడే వ్యాసుడికి అలాంటి ఊహ రావడం, సైంటిఫిక్ గా రూపొందించడం ఆశ్చర్యం, అద్భుతం. ఆ టెక్నాలజీ ద్వాపరం దాటి కలియుగానికి రాలేదన్నది వాస్తవం. మాతృ స్పర్శ లేని సంతానంలో ఎన్నో సమస్యలు వస్తాయి ఇప్పటి సైన్సు చెబుతోంది. అందువల్లే ఘృతభాండాలలో ఉన్న తన బిడ్డలను రోజు గాంధారి తాకాలని చెప్పాడు, వ్యాసుడు. ఆ రకంగా కుండల్లో ఉన్న పిండాలు తల్లి గర్భంలో ఉన్నట్టే పెరిగారు. ఇంత సైన్స్ కనిపిస్తూ ఉంటే, మహాభారతంనాటికి సైన్స్ లేదని ఎలా చెప్పగలం? ఇక, ట్రాన్సెండర్, ట్రాన్ సెక్సువల్. లింగమార్పిడి మహాభారతంకాలం నాటికే ఇది ఉంది. భీష్ముడిని చంపేందుకు అంబ శిఖండిగా పుట్టింది. మొదట ఆడపిల్లగా పుట్టి, ఆ తర్వాత మగవాడిగా మారిన క్యారెక్టర్ శిఖండి. ఆడపిల్లగా పుట్టినా, మగవాడి లక్షణాలే ఉన్న పాత్ర శిఖండి. దీన్నే ఇప్పటి భాషలో ట్రాన్ సెక్సువలిజమ్ అంటున్నారు. దానికి అనుగుణంగా ఇప్పుడు సర్జరీలు కూడా చేస్తున్నారు. చాలామంది లింగ మార్పిడి చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఒక యక్షుడు ఆమెకి సైక్రియాటిక్ ట్రీట్మెంట్తో మగతనాన్ని ఇచ్చాడు. దాంతో అంతవరకు మగలక్షణాలతో ఉన్న ఆడపిల్లగా పెరిగిన శిఖండి, పూర్తిగా మగవాడిగా మారాడు..ఇక, బృహన్నల పాత్ర మరో అద్భుతం. ఇది టెంపరరీ ట్రాన్ సెక్సువలిజమ్. ఇది సాధ్యమా? సాధ్యమే అని మోడరన్ సైన్స్ చెప్తుంది ఇటువంటి స్థితిని హెర్మా ప్రోడైటిజమ్ అంటారు. కొంతకాలం స్త్రీగా ఉండి మళ్లీ పురుషుడిగా మారే లక్షణం, ఇది. కొన్ని జంతువుల్లో ఈ లక్షణం ఉంటుంది. ఊర్వశి శాపం వల్ల అర్జునుడు ఏడాది పాటు ట్రాన్ స్ జెండర్ గా ఉన్నాడు. అజ్ఞాతవాసంలో ఆ శాపమే ఆయనకు వరంగా మారింది. ఇది పూర్తిగా సైకలజికల్ యాస్పెక్ట్ గా వైద్యులు చెప్తారు. కనుక, మహాభారత కాలంలోనే హెర్మా ప్రోడైటిజమ్ గురించి అవగాహన ఉందని అనుకుందామా! కోరుకున్నప్పుడు పురుషుడు స్త్రీగా మారే ట్రీట్మెంట్లు ఆ రోజుల్లోనే ఉన్నాయని చెప్పేందుకు బృహన్నలను మించిన ఎగ్జాంపుల్ ఉందా? ఇక, టెస్ట్ ట్యూబ్ బేబీస్ గురించి మహాభారతంలో ఎన్నోసార్లు కనిపిస్తుంది. అసలీ టెక్నాలజీని మహాభారతంలో వాడుకున్నట్టు ప్రపంచ సాహిత్యం, లేదా, చరిత్రలో ఇంకెవరు వాడలేదు. భారతంలో టెస్ట్ ట్యూబ్ తరహాలో పుట్టినవారు చాలామంది ఉన్నారు. కౌరవులు కృత్రిమ గర్భంలో పెరిగారు. పురాణాల్లో వశిష్ఠుడు, అగస్త్యుడు టెస్ట్ ట్యూబ్ తరహాలో పుట్టినవారే. భారతంలో ద్రోణుడు, కృపాచార్యుడు, కృపి భాండాలలో పుట్టినవారే. స్త్రీబీజం నుంచి అండకణాన్ని సేకరించి, గర్భాశయం వెలుపల పోషకాలలో ఉంచి, చుట్టూ వీర్య కణాలను వదిలి, ఆ వీర్య కణాలతో అండాన్ని కలపడం అనే టెక్నాలజీ వేల క్రితమే తెలుసు అంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ద్రోణుడిని కుంభసంభవుడు అంటారు, అంటే, ప్రత్యేకమైన కుండలో పెరిగాడు. ద్రోణుడు తండ్రి భరద్వాజుడు. ఆ కాలంలోనే యంత్ర శాస్త్రాన్ని పరిశోధించిన శాస్త్రజ్ఞుడు. అతనికి ఇలాంటి టెస్టు ట్యూబ్ టెక్నాలజీ తెలియడంలో వింత ఏమీ లేదు. ఇప్పటి ఫిజిక్స్ సూత్రాలు ఎన్నో మనకు మహాభారతంలో కనిపిస్తాయి ,”నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః”. అంటే, అర్థం, ఉన్నదానిని పూర్తిగా నాశనం చేయలేం.. లేని దాని నుంచి ఉన్నదానిని సృష్టించలేం౼అని. పదార్థం శక్తిగా మారుతుంది, శక్తి పదార్థంగా మారుతుంది అని మరో అర్థం. అంటే, శక్తిని నాశనం చేయలేము అనే కదా అర్థం. ఐన్ స్టీన్ “ఇ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్” శక్తి సూత్రం ఇలాంటి అర్ధాన్ని చెప్తుంది కదా. ఇలాంటి ఎనర్జీ థియరీస్ ఎన్నో మనకు మహాభారతంలో కనిపిస్తాయి. 1945 జూలైలో అమెరికన్ సైంటిస్ట్ రాబర్ట్ ఓపెన్ హైమర్ తొలి అణుబాంబును పరీక్షించాడు. అప్పుడు జరిగిన మహావిస్ఫోటనం గురించి ప్రపంచం అంతా చర్చించుకుంది. ఒక ఆంధురాలికి కూడా ఆ కాంతి అనుభవం కలిగి, తన తాతను “ఏం జరిగింది?” అని అడిగిందట. అంటే, అంధులకు కూడా కనిపించేంత డీప్ ఫ్లైట్ ని న్యూక్లియర్ బాంబ్ కల్పించగలరు. ప్రెస్ మీట్లో ఆ బాంబు గురించి హైమర్ ని అడిగారు. అప్పుడు ఆయన చెప్పిన సమాధానం భగవద్గీత గురించి. భగవద్గీతలో విశ్వరూప దర్శనం ఉంటుంది. అందులో, “దివి సూర్యసహస్రస్య” అనే శ్లోకం అర్థాన్ని ఒక విదేశీయుడైన ఓపెన్ హైమర్ వివరించాడు. 5000 సంవత్సరాల క్రితం కురుక్షేత్ర యుద్ధం సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చూపించిన విశ్వరూపం ఒక ఆటంబాంబు విస్ఫోటనంతో సమానంగా వివరించాడు, హైమర్. అంధుడైన ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని చూసినట్లు మహాభారతం చెప్తోంది. అంటే, ఒక అణుబాంబులాంటి కాంతిని అంధులు కూడా చూడగలరని ఋజువైనట్టే. విశ్వరూపం అంటే శరీరం పెరగడం. ఈ విశ్వరూపం గురించి వరల్డ్ ఫేమస్ సైన్స్ ఫిక్షన్ రచయిత అసిమోవ్ కూడా వివరించారు. ఈ విశ్వరూపాన్ని ఫిజిక్స్ లోకి మారిస్తే, మాక్రో వైజేషన్, మైక్రోవైజేషన్ అంటారని ఆసిమావ్ చెప్పారు. మాక్రో వైజేషన్ అంటే, స్థూల శరీరం. అంటే పెద్ద శరీరం. మైక్రో అంటే, సూక్ష్మ శరీరం. యోగసాధన ద్వారా శరీరాన్ని పెద్దది చేసుకోవడం, సూక్ష్మంగా మార్చుకోవడం సాధ్యమే అని అసిమోవ్ అన్నారు. ఈ విశ్వరూపం ఆధారంగానే అసిమవ్ రాసిన నవల “ఫెంటాస్టిక్ ఓయేజ్ టు డెస్టినేషన్ బ్రెయిన్”. విశ్వరూప విద్య వస్తే అంతా నీలోనే ఉన్నట్టు సామాన్యులకు అనిపిస్తుంది. దైవం అంటే అదే కదా. అందువల్ల విదేశీయులు గుర్తించిన విషయాలను కూడా మనం మహాభారతంలో గుర్తించలేకపోయాం ఎందరో విదేశీయులు మహాభారతంపై రీసెర్చ్ చేసారు. వారు చెప్పినదానిని బట్టి మహాభారతం సమయంలో ఇప్పటి ఊహాలకు కూడా అందనంత సైన్స్ ఉంది. ఆ టెక్నాలజీ ద్వాపరయుగం దాటి కలియుగంలోకి రాలేదు. కలియుగంలో మళ్లీ సైన్స్ ఓనమాల దగ్గర నుంచి ప్రారంభమైంది. ప్రతి యుగానికి, యుగానికి మధ్య సంధి కాలం ఉంటుంది. ఆ సంధికాలమే ప్రళయం. పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి మళ్లీ కొత్తగా కాలం చిగురిస్తుంది. కానీ, ఏం జరిగిందో కూడా ఆ కాలమే కొన్ని హింట్స్ ఇస్తుంది. అలా గత చరిత్రను గుర్తు చేసేందుకు కాలం ఇచ్చిన గ్రేట్ హింట్ మహాభారతం