Sunday , May 26 2024

సాయి సంతోషి ఇండస్ట్రీ రైస్ మిల్ ను ప్రారంభించిన ఎమ్మేల్యే పద్మా దేవేందర్ రెడ్డి.

తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన ప్రతినిధి మార్చి 15:

మెదక్ మండలం పాతూర్ గ్రామ పరిధిలో నూతనంగా నిర్మించిన సాయి సంతోషి ఇండస్ట్రీ రైస్ మిల్ ను బుధవారం మెదక్ శాసన సభ్యురాలు పద్మ దేవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా రైస్ మిల్లు యజమానులైన కొత్త స్రవంతి రాజేందర్, పట్నం స్వప్న -చంద్రశేఖర్ కు
లకు ఎమ్మేల్యే శుభాకాంక్షలు తెలిపారు. చుట్టూ పక్కల గ్రామ రైతులకు రైస్ మిల్లు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రైతులు పండించిన ధాన్యం పట్టణాలకు తీసుకెల్లకుండ దగ్గర్లోనే ఏర్పాటు చేసినందుకు యజమానులను ఎమ్మెల్యే అభినందించారు.ఈ కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మెదక్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు లావణ్య రెడ్డి,ఆత్మ కమిటీ చైర్మన్ అంజగౌడ్ మెదక్, రామాయంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ లు బట్టి.జగపతి, సరాఫ్ యాదగిరి,మెదక్, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ లు చంద్రపాల్, పల్లె జితేందర్ గౌడ్,పాతూర్ గ్రామ సర్పంచ్ లింగవ్వ, మెదక్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, నాయకులు బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

One comment

  1. Fantastic items from you, man. I’ve bear in mind your stuff previous to and you are simply extremely excellent.
    I really like what you’ve acquired here, really
    like what you are saying and the best way through which
    you say it. You’re making it enjoyable and you continue to take care of to keep it sensible.
    I can not wait to learn much more from you. That is really a wonderful website.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *