Wednesday , July 24 2024

సాగర్ సిమెంట్ ప్రజాభిప్రాయ సేకరణకు ప్రజల మద్దతు

గ్రామాల అభివృద్ధికి సహకారం అందిస్తాం ఫ్యాక్టరీ యాజమాన్యం

డి ఏం ఎఫ్ టి, సి ఎస్ ఆర్ నిధులు గ్రామాల అభవృద్ధికి విడుదల చేస్తాం

గ్రామాల్లో మెడికల్ క్యాంపు లను నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు

తెలంగాణ కెరటం సూర్యాపేట

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు శివారులోని సాగర్ సిమెంట్స్ పరిశ్రమ యొక్క సున్నపు రాయి (మైనింగ్) ఉత్పత్తి 1.0 ఎంటిపీఏ నుండి 2.5 ఎంటిపీఏ వరకు మరియు సిమెంట్ ఉత్పత్తిని 1.5 ఎంటివీఏ నుండి 3.8 ఎంటిపీఏ నూతన లైన్ 2 నిర్మాణం ద్వారా మరియు పవర్ ప్లాంట్ సామర్థ్యమును ఐదు మెగావాట్ల నుండి 12 మెగావాట్ల వరకు పెంచుట ద్వారా ప్రస్తుత సిమెంటు ప్లాంటు మైనింగ్ విస్తరణ కొరకు యొక్క ప్రధాన అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని సాగర్ సిమెంట్స్ వారు ఉత్పత్తి ని పెంచాలని ప్రతిపాదించారు. దానిలో భాగంగానే శనివారం ప్రజాభిప్రాయ సేకరణ ప్యా నెల్ కమిటీ చైర్మన్ సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్
వెంకట్రావు అధ్యక్షతన,ఉమ్మడి నల్గొండ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఈ ఈ సురేష్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ సున్నపురాయి గని యొక్క ఉత్పత్తి సామర్ధ్యాన్ని 3.8 నుండి 5.4 ఎం టి పి ఎ కు పెంచుటకు, వీటితోపాటు 1×1000 టి పి హెచ్ క్రషర్ ను నెలకొల్పుటకు ప్రస్తుతం ఉన్న లీజ్ ఏరియా అయినా 328.58 హెక్టార్లలో సున్నపురాయి గనిని విస్తరించుటకు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు వివిధ కుల సంఘాల నాయకులు ఎన్జీవోస్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడాలని గ్రామాల అభివృద్ధికి సహకరించాలని సిఎస్ఆర్ ఫండ్స్ డి ఎం ఎఫ్ టి నిధులు మండలానికి చెందిన గ్రామాలకు మాత్రమే వినియోగించాలని కోరారు. ముఖ్యంగా పెదవీడు గ్రామంలో హాస్పిటల్ నిర్మించి ఎంబిబిఎస్ డాక్టర్ మరియు సిబ్బందిని నియమించాలని, వాటి నిర్వహణ ఫ్యాక్టరీ యాజమాన్యం వారే నిర్వహించాలని స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎన్నో సంవత్సరాలుగా కర్మాగారంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగస్తులను పర్మినెంట్ చేయాలని కృష్ణా నదిపై నిర్మించిన పెడవీడు లిఫ్టు నిర్వహణ బాధ్యత సిమెంటు ఫ్యాక్టరీ యాజమాన్యం వారు తీసుకోవడం వల్ల రెండు పంటలు సమృద్ధిగా పండుతున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రరావు మాట్లాడుతూ మండల పరిధిలోని గ్రామాల్లో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని ఫ్యాక్టరీ యాజమాన్యం గ్రామాలలో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలు పెంచాలని అది వారి బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. సి ఎస్ ఆర్ ఫండ్స్ ను డిఎంఎఫ్టి ఫండ్స్ ను స్థానికంగా కేటాయించేందుకు సహకరిస్తామని ఇందుకు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నేతృత్వంలో త్వరలో సమావేశం కానున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అలజడులు జరగకుండా ఏ ఎస్ పి నాగేశ్వరరావు పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ ఆర్డిఓ జగదీశ్వర్ రెడ్డి, కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి హుజూర్నగర్ సిఐ గజ్జె చరమందరాజు మఠంపల్లి తహశీల్దార్ ఎల్ మంగా మఠంపల్లి ఎస్సై రామాంజనేయులు సాగర్ సిమెంట్స్ యాజమాన్యం మోహన్ రెడ్డి హరిదాస్ వెంకట్ రెడ్డి మైన్స్ మేనేజర్ సుబ్రమణ్యం కెసిఆర్ కాంట్రాక్టు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతాబాబు మాదిగ రాష్ట్ర కార్యదర్శి రావూరి విజయభాస్కర్ ఎమ్మెస్ పి జిల్లా ఉపాధ్యక్షులు బాల చంద్రు ఎంపీపీ పార్వతీ కొండా నాయక్ జెడ్పిటిసి బానోతు జగన్ నాయక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముఖ్య మంజీ నాయక్ రఘునాధపాలెం ఎంపీటీసీ 2 గుండా బ్రహ్మారెడ్డి మాజీ సర్పంచ్ లు బీబీ కుతుబ్ ఆదూరి కిషోర్ రెడ్డి బా విజయ నాగేశ్వర్ రావు చిలక గురువయ్య ఎంపీటీసీలు కుందూరు వెంకటరెడ్డి బానోతు సైదమ్మ బుక్య జ్యోతి చింతారెడ్డి నాగిరెడ్డి బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఇరుగు పిచ్చయ్య. బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రాపోలు నవీన్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు దేవపాంగు బాబు మొగిలి మట్టపల్లి యాదవ్ కొత్తపల్లి ప్రజా నాట్య కళా మండలి బాదే నర్సయ్య నాయకులు నవీన్ నాయక్ కృపానందం కరీం మహేష్ గౌడ్ కర్నె వెంకటేశ్వర్లు దైదరాయులు కొమ్ము సైదులు మరియు ఎన్జీవోస్ తదితర నాయకులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.