Thursday , May 23 2024

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అన్నదమ్ములు నాగరాజు గౌడ్, దుర్గా గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అన్నదమ్ములు నాగరాజు గౌడ్, దుర్గా గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి మే 28:

మెదక్ – హైదరాబాద్ జాతీయ రహదారిపై కొల్చారం గ్రామ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య నలుగురికి చేరింది. సంఘటన స్థలంలో నాగరాజ్ గౌడ్ తో పాటు 9 నెలల చిన్నారి మృతి చెందింది. కాగా భార్య భర్తలు దుర్గ గౌడ్,లావణ్య ఇరువురు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాదులో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. వీరి మృతి పట్ల మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. భార్యాభర్తలు చికిత్స పొందిన మల్లారెడ్డి ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడి చికిత్స మొత్తం ఖర్చులను చూసుకుంటానని ఎమ్మెల్యే తెలియజేయడంతో ఆస్పత్రి యజమాన్యం మృతుల కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పజెప్పారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆదివారం మృతుల స్వగ్రామమైన పాపన్నపేట మండల పరిధిలోని ఎల్లాపూర్ గ్రామానికి వెళ్లి

నివాళులర్పించారు.టేక్మాల్.దుర్గ గౌడ్ కుటుంబానికి అన్నివేళల అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అంత్యక్రియ నిమిత్తం 20,000/-వేల రూపాయలను అందజేశారు.దుర్గ గౌడ్ తల్లి ఇద్దరు కొడుకులు కోల్పోయి దీనస్థితిలో ఉన్న తల్లిని ఎమ్మెల్యే ఓదార్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. దుర్గ గౌడ్ టిఆర్ఎస్వి నాయకునిగా పార్టీకి ఎంతో సేవ చేశారని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం చాలా బాధాకరమన్నారు.

గౌడ్ తల్లి ఇద్దరు కొడుకులు కోల్పోయి దీనస్థితిలో ఉన్న తల్లిని ఎమ్మెల్యే ఓదార్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. దుర్గ గౌడ్ టిఆర్ఎస్వి నాయకునిగా పార్టీకి ఎంతో సేవ చేశారని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం చాలా బాధాకరమన్నారు

గౌడ్ తల్లి ఇద్దరు కొడుకులు కోల్పోయి దీనస్థితిలో ఉన్న తల్లిని ఎమ్మెల్యే ఓదార్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. దుర్గ గౌడ్ టిఆర్ఎస్వి నాయకునిగా పార్టీకి ఎంతో సేవ చేశారని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం చాలా బాధాకరమన్నారు