జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ దేవయ్య
తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా గ్రామీణ వైద్యులకు గత ఎన్నికల ముందు నుండి గ్రామీణ వైద్యులకు పారామెడికల్ ట్రైనింగ్ శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు ఇస్తానంటూ చెప్పడమే జరుగుతుంది కానీ ఇప్పటివరకు ఏ జిల్లాలో పూర్తి ట్రైనింగ్ కాలేదు.
ప్రజలకు రైతులకు ప్రతిరోజు రాత్రనక పగలనక ప్రజలకు సేవలు అందించే ఆపదలో ఆదుకునే మమ్ములకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ , వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు మమ్మల్ని గుర్తించాలని కోరుచున్నాము.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందజేస్తుంది గ్రామీణ ఆర్.ఎం.పి పి.ఎం.పి వైద్యులే ప్రథమ చికిత్స చేస్తూ ప్రభుత్వ వైద్యశాలకు పంపిస్తున్నారు కరోనా సమయంలో ప్రజలకు సేవలు చేస్తూ ప్రాణాలను విడిచారు వారి కుటుంబాలను కూడా ఆదుకోవాలని కోరుచున్నాము అన్ని కులాలకు ప్రభుత్వం ఏదో విధంగా పథకాలను పెడుతున్నది కానీ మా ఆర్ఎంపి పిఎంపి వైద్యులకు ఎలాంటి సహాయం లేదు కనీస జీవనాభృతిని అందియాలను కోరుచున్నాము.
ఒక్కో ఆర్ఎంపి పిఎంపి 500 మంది ఓటర్ తో సమానంగా ఎన్నికల్లో పనిచేస్తున్నారు ప్రభుత్వ పథకాలను ప్రతి గ్రామంలో వివరంగా చెప్పేది గ్రామీణ వైద్యులే అలాంటి మమ్ములను ప్రభుత్వం గుర్తించాలి మారుమూల గ్రామంలో నిరంతరం పేదవారికి వైద్య సేవలు అందిస్తున్న మా ఆర్ఎంపి పి ఎం పి వైద్యులను గుర్తించి ప్రతి కుటుంబానికి 5 లక్షలు మరియు ఇల్లు లేని వైద్యులకు ఒక ఇల్లు ఇవ్వాలని కోరుచున్నాము.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కుల సంఘాలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం తెలంగాణలో ఎంతోమందికి న్యాయం జరుగుతుంది కానీ ఆర్ఎంపీ పి.ఎం.పి వైద్యులకు మాత్రం ఆదరణ కరువైంది సంక్షేమ పథకాలలో ప్రభుత్వం పెడుతున్న దాంట్లో గ్రామీణ వైద్యులకు ఎలాంటి పథకాలు లేవు రాష్ట్రంలో మొత్తం ఒక లక్ష 50 వేల మంది ఆర్ఎంపి పీఎంపీ లు ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ను నడుపుచు ప్రజలకు వైద్యాన్ని అందిస్తున్నారు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపి పిఎంపి వైద్యులు కీలకపాత్ర వహిస్తున్నారు ఇప్పటికీ రాత్రనక పగలనక ప్రజలకు సేవలందిస్తున్నారు ఆర్ఎంపి పిఎంపి వైద్యులు కూడా నిరుద్యోగులే మేము డిగ్రీలు పీజీలు డిప్లొమా కోర్సులు చేసిన వారిలో అర్హులైన వారికి ప్రతి గ్రామంలో పల్లె దావకానలో మాకు ఉద్యోగాలు కల్పించాలని కోరుచున్నాము.
తెలంగాణ ఆర్ఎంపి &పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ దేవయ్య కోరుచున్నారు.