Tuesday , July 16 2024

కేరళ రెవెన్యూ శాఖ మంత్రితో.. తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

  • వనపర్తి ఎమ్మెల్యే తూడిమేగా రెడ్డి

తెలంగాణ కెరటం వనపర్తి జిల్లా ప్రతినిధి జనవరి 3

తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ. సమాచార పౌర సంబంధాల శాఖ. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో (నేడే శనివారం) సచివాలయంలో కేరళ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ రాజన్ భేటీ అయ్యారు. ధరణి పోర్టల్ పలు అంశాలతో పాటు భూమాత పోర్టల్ ఏర్పాటులో పలు కీలక అంశాలపై చర్చించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం అనువైన సాంకేతిక పద్ధతులపై వారు చర్చించారు చిత్రంలో తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ శాఖ. సమాచార పౌర సంబంధాల శాఖ. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కేరళ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రాజన్ వనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు తూడి మేఘ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సాంబశివరావు. తదితరులు ఉన్నారు….