Thursday , May 23 2024

రైతు ఆర్థికా అభివృద్ధి కి కృషి సింగిల్విండో చైర్మన్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి

తెలంగాణ కెరటం
రాజన్న సిరిసిల్ల జిల్లా
ఎల్లారెడ్డిపేట ప్రతినిది
మార్చి : 3

ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం
ఆధ్వర్యంలో దీర్గకాళిక రుణాలకు సంబందించిన ముగ్గురు రైతులకు గాను 11,00,000/- లక్షల రూపాయల రుణాన్నిలబ్దిదారుల కు అందజేసారు.
వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి పరచడం కొరకు TESCAB చైర్మన్ కొండూరి రవీందర్ రావు సహకారంతో దీర్గకాళిక రుణాలు పెద్ద ఎత్తున ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా పంపిణి చేయటం జరుగుతుంది. ఈ సందర్భంగా అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి తెలియజేసారు.
రైతులు ఆర్ధిక స్వావలంబన సాదించాలంటే వ్యవసాయం తో పాటు దాని అనుబంద రుణాలు అయిన డైరీ, గొర్రెలు , పట్టు పురుగులు, కోళ్ళపెంపకం, బోరు మోటార్ పైప్ లైన్, ట్రాక్టర్, హీర్వేస్టర్ లకు సహకార సంఘాలకు ఇచ్చే ధీర్గకాలిక రుణాలు వాడుకొని ముందుకు సాగాలని కోరారు.
లబ్దిదారులు:- 1). బిర్ల బాలమల్లవ్వ 5,00,000/- (రాగట్ల పల్లె),
2). సిరిపురం లక్ష్మీ 3,00,000/-(నారాయణ పూర్)
3), తాడ ప్రతాపరెడ్డి 3,00,000/-(కొరుట్ల పేట), లక్షల రూపాయల చెక్కులను అందజేశారు.
ఈ కార్యక్రమములో సంఘ ఉపాధ్యక్షులు జంగిటి సత్తయ్య, డైరక్టర్ నేవూరి వెంకట నరసింహారెడ్డి, సంఘ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు…

One comment

  1. Looking for quick and easy dinner ideas? Browse 100

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *