తెలంగాణ కెరటం మహబూబ్నగర్ జిల్లా బ్యూరో,
మక్తల్.
నియోజకవర్గంలోని ఐదు రైస్ మిల్లులపై సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు సోమవారం సాయంత్రం దాడి చేసి ఐదు రైస్ మిల్లులను సీజ్ చేశారు. ఈ సీజన్ కాలంలో ప్రభుత్వానికి సకాలంలో బియ్యం ఇవ్వనందుకు ఈ దాడులు నిర్వహించినట్టు కు సమాచారం.
ఈ విషయంపై ఎన్ఫోర్స్మెంట్ అధికార్లైన గురు రాజారావు. ఆనంద్.కాళప్పను వివరణ కోరగా రైతుల నుండి మద్దతు ధర కింద సేకరించిన బియ్యాన్ని రైస్ మిల్లుల యజమానులకు ఇవ్వగా వారు ప్రభుత్వానికి క్రష్ఠం మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. రైసుమిల్లుల యజమానులు సకాలంలో సివిల్ సప్లైకి బియ్యం ఇవ్వనందున కలేక్టర్ మూడు సార్లు నోటీసులు జారీ చేశారని.మిల్లు యజమానులు సమాధానం. నిర్లక్ష్యం వహించినందుకు రైసు మిల్లులను సీజ్ చేయాలని కలెక్టర్ ఆదేశాల మేరకు నేడు మక్తల్ మూడు.మాగనూరులో రెండు రైస్ మిల్లులు. సిజ్ చేశామన్నారు.
మక్తల్ మండలం లోని నారాయణపేట మలుపు దగ్గర ఉన్న ఓమర్ 24వేల550.లిమ్రా రైస్ మిల్ 47వేల919.స్టార్ రైస్ మిల్లులు 45వేలు. మాగనూర్ మండలంలోని తెలంగాణ రైస్ మిల్లు 17వేల540.వడ్డేవాట్ రోడ్ లో ఉన్న మల్లికార్జున రైస్ మిల్ల 45 వేల బస్తాల ధాన్యం తేడా ఉన్నందున తనిఖీ చేసి సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. కృష్ణ మండలంలో రైస్ మిల్ యజమానులకు నోటీసులు ఇచ్చిన స్పందించలేదని త్వరలో అవకాశముందని పేరు చెప్పుని ఓ అధికారి సమాచారం ఇచ్చారు. మరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇలా దాడులు కొనసాగిస్తారా పలు మిల్లులపై ఇలాంటి కేసులో నమోదు చేస్తారా అని కొందరు మిల్లు యజమానులు చర్చించుకుంటున్నారు,