Wednesday , July 24 2024

రైస్ మిల్లు లపై విజిలెన్స్ దాడులు?

తెలంగాణ కెరటం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి డిసెంబర్:-12

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలం మర్తన్నపేట గ్రామ శివారులో గల రైస్ మిల్, రగుడు చౌరస్తాలో గల రైస్ మిల్లులపై మంగళవారం ఉదయం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి రెండు రైస్ మిల్లుల పై కేసు నమోదు చేసినట్టు సమాచారం రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న సమాచారం తెలుసుకున్న మిగతా రైస్ మిల్ యజమానులు అధికారులు తిరిగి వెళ్లేంతవరకు రైస్ మిల్లు లు మూసి ఉంచారు తనిఖీలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది