Thursday , November 7 2024

తండ్రికి తలకొరివి పేట్టిన కుమార్తె

రాయపొల్ లో పండుగ పూట విషాదం

అప్పన్న హస్తం కోసం ఎదురుచూపులు

తెలంగాణ కెరటం:రాయపోల్ ప్రతినిధి:జనవరి

తండ్రి గుండెపోటుతో మృతి చెందగా తండ్రికి కుమార్తె తలకొరివి పెట్టింది. ఈ విషాద సంఘటన రాయపోల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది.గ్రామస్తులుకుటంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.రాయపోల్ మండల కేంద్రానికి చెందిన కుంట (కుర్మ) ఆనిల్ కుమార్ .సంతోష భార్యాభర్తలు వీరికి ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె పూజ చిన్న కూతురు తేజ శ్రీ ఉన్నారు.కులీ పనులు చేసుకుంటూ బ్రతుకును కొనసాగిస్తున్నారు.గ్రామంలో బతుకు దేరూవు లేకపోవడంతో కొల్తూర్ గ్రానికి వెళ్లారు. అక్కడ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల కురుమ అనిల్ తన తల్లి వద్దకు వెళ్లాడు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఒకసారి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. కాగా సోమవారం సాయంత్రం తన గ్రామంలో అనిల్ కుమార్ చిన్ననాటి దోస్తులు. గ్రామస్తుల మధ్య అంతక్రియలు నిర్వహించారు. కాగా అనిల్ కుమార్ పెద్ద కుమార్తె తలకొరివి పెట్టడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది అందరితో కలగలుపుగా ఉంటూ అంతలోనే అనంత లోకాలకు అనిల్ కుమార్ వెళ్ళిపోవడంతో అతని మిత్రులు. గ్రామస్తులు తీవ్ర విచారణ వ్యక్తం చేశారు .
ఈ నిరుపేద కుటుంబానికి చెందిన అనిల్ కుమార్ మృతి చెందడం వల్ల కుమార్తెలకు కన్నీళ్లు మిగిల్చ వెళ్లిపోయాడు చాలా బాధాకరమన్నారు. ఆ ఇద్దరి పిల్లలను మానవత వాదులు వారి కుటుంబాన్ని ఆదుకోవాలని చిన్ననాటి మిత్రబృందం అన్నారు.