Tuesday , July 16 2024

రవీంద్రనాథ్ ఠాగూర్

తెలంగాణ కెరటం, చెన్నూర్ నియోజకవర్గ ప్రతినిధి, మే 7:

భారతదేశంలోని ప్రతీ పౌరుడు ఆలపించే గీతం జనగణమన. ఇది రానివారంటు ఉండరు చరిత్రలోనే నిలిచిపోయిన జాతీయ గీతాన్ని రచించిన మహాను బావుడు రవీంద్రనాతుడు. ఆయన రచనలతో ప్రజలను ఆకట్టుకొని ఎందరినో ప్రబావితులను చేసిన కవితా పితామహుడు. ఆసియా ఖండంలోనే మొదటి సారిగా నోబుల్ బహుమతి గైకొన్న మహా పోరుషుడు. ఆయన జయంతి సందర్భంగా తన జీవిత గాదలు కొన్ని.

బాల్యం,

భారతదశంలోని వంగదేశమైన పచ్చిమబెంగాల్ రాష్ట్రంలోని, కోల్కతా ( జొరసంకో తకుర్బరి ) లో 1861 మే 7 వ తేదీనాడు దేవేంద్రనాథ్ ఠాకూర్, శారదా దేవీలకు పడ్నాలుగవ సంతానంగా రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించాడు. ఇతని బాల్యం చాలా చోద్యంగా గడిసింది. ఆముదం దీపం ముందు పుస్తకం పట్టుకొని కూర్చొని ఆవలిస్తూ కునుకుపట్లు పడుతూ చదివేవాడు. నిద్ర లేవగానే ఇంటి తోటలోకి వెళ్లి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఆనందించేవాడు. ఇతనికి కథలంటే చాలా ఇష్టం. సామాన్య దుస్తులతో నిరాడంబర జీవితాన్ని గడిపాడు. బాల్యంలో ఇంట్లోనే నడిగోడలమధ్య జీవించిన ఈయనకు బయటి ప్రపంచం ఏమి తెలియదు. ప్రపంచమొక రహస్యమని ఆ రహస్యాన్ని తెలుసు కోవాలని ఎంతో కూతుహల పడేవాడు రవీంద్రనాథ్ రెండవ సోదరుడు సత్యేంద్రనాత్ ఠాగూర్ మొట్టమొదటి ఇండియన్ సివిల్ సర్వీసుల నియమితుడైన మొదటి భారతీయుడు. 

రవీంద్రుడు పాఠశాలలో చదవడానికి ఇష్ట పడకా ఇంటివద్దే వుంటూ క్రమశిక్షణతో వ్యాయమం, లెక్కలు, చరిత్ర, భూగోళ పాఠాలను, చిత్ర లేఖనం, ఇంగ్లీష్, ఆటలు, పాటలు అభ్యసించేవారు. ఆదివారం సంగీతం, భౌతిక శాస్త్ర ప్రయోగాలు, సంస్కృత వ్యాకరణం, బొమ్మలున్న ఆంగ్ల నవలలను స్వయంగా చదివేవాడు. కాళిదాసు, షేక్స్పియర్ నవలలు చదివి ప్రబావితుడైన రవీంద్రుడు మాతృ భాషపట్ల అభిమానం పెంచుకున్నాడు. 

ఠాగూర్ ఇంగ్లండులోని ఒక బబ్లిక్ స్కూలులోచేరి ప్రోపేసర్ మార్లే ఉపన్యాసాలు వినీ ఆంగ్ల సాహిత్యంపై అభిరుచి పెంచుకున్నాడు. సాహితీ పరుల ప్రసంగాలువిని వారితో సంభాషించి నాటకాలకు, సంగీత కచేరీలకు వెళ్లి ఆంగ్ల సంస్కృతిని చాలా ఆవలించు కున్నాడు. తన అనుభవాలను భారతికి లేఖలుగా వ్రాసేవాడు. రవీంద్రుడు ఇంగ్లండులో వుండగానే బేజ్ఞాహృదయం అనే కావ్యాన్ని వ్రాశాడు. ఇంగ్లండులో 18 మాసాలు వుండి ఏ డిగ్రీ చేయకుండానే భారతదేశానికి తిరిగివచ్చాడు. ఆ తర్వాత 1883 డిసెంబర్ 9 న మృణాళిని దేవిని వివాహమాడాడు 

సాహితీవ్యాసంగాలు.

రవీంద్రుడు బాల్యంలోనే అనేకా పద్యాలు, వ్యాసాలు వ్రాశాడు. ఆయన రచించిన సంద్యాగీత్ కావ్యాన్ని కవులందరు మెచ్చుకున్నారు. వందేమాతర గీతాన్ని రచించిన బంకించంద్ర ఛటర్జీ కూడా రవీంద్రుని ప్రశంసించాడు. తను రాసిన భక్తి గీతాలను తండ్రి విని వాటి ప్రచరణకు అవసరమైన డబ్బులు ఇచ్చేవాడు. ఆ తరువాత విర్గారెర్ స్వప్న భంగ, సంగీత ప్రభాత అనే కావ్యాలను రచించాడు.

గీతాంజలి.

ఠాగూర్ రచనలలో గీతాంజలి చాలా గొప్పది ఆయనకు  పేరుప్రతిష్టలను తెచ్చిపెట్టింది. తాను బెంగాలీ భాషలో రచించిన భక్తిగీతాలు కొన్నింటిని ఆంగ్లంలోకి అనువదించి గీతాంజలి అని పేరుపెట్టి ప్రచురించాడు  అది అనేక ప్రపంచ భాషలలోకి అనువదించారు. ప్రపంచ సాహిత్యంలో ఇది ఒక గొప్ప రచన. మానవుని కృంగదీసే నిరాశ నిస్పృహలను సకల సృష్టిని ప్రేమాబావంతో చూసి శ్రమయొక్క గొప్పతనాన్ని సూచించే మహత్తర సందేశం గీతాంజలి లోని ముఖ్యాంశం. 1913 వ సంవత్సరంలో సాహిత్యానికి సంబంధించి రవీంద్రుని గీతాంజలికే నోబుల్ భహుమతి లబించింది. విశ్వకవి అనే బిరుదును సాధించిపెట్టింది. ఆసియా ఖండంలో మొదటిసారి నోబుల్ బహుమతి పొందిన వ్యక్తి ఠాగూర్. గీతాంజలి వెలువడిన తరువాత అన్ని దేశాలవారు రవీంద్రుని గ్రందాలను చదవడం ప్రారంభించారు.

శాంతిని కేతన్.

రవీంద్రుడు కేవలం రచయితగానే ఉండిపొక బాలల హృదయాలను వికసింప చేయటానికి ప్రాచీన ఋషుల గురుకులాల తరహా శాంతినికేతన్ గా ప్రసిద్ది గాంచిన విశ్వభారతీ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. అది ఐదుగురు విద్యార్థులతో మొదలై క్రమంగా విస్తరించింది. చిన్నపిల్లలు, ఉపాధ్యాయులు, ప్రాతఃకాలన్నే లేవడం కాలకృత్యాలు తీర్చకోవడం తమగదును తామే శుభ్రపరచుకొని స్నానం చేయడం ప్రార్థన చేయడం, నియమిత వేళల్లో నిద్రపోవడం, పెద్దలను, గురువులను గౌరవించడం పిల్లలకు నేర్పేవారు. 1919 లో కళాభవన్ ను ఆయన స్థాపించాడు అక్కడ విద్యార్థులు విభిన్న కళలను నేర్చుకునేవారు.

నవల,నాటకాలు.

గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయమని రవీంద్రుడు భావించాడు. అందుకే శ్రీనీకేతాన్ని నెలకొల్పి గ్రామ పునర్నిర్మాణానికి ఎంతో కృషి చేశాడు. మొదటి వాల్మీకి ప్రతిభఅనే నాటకాన్ని రచించి తదుపరి అమల్ అనే పిల్లవాని గురించి పోస్తాపీసు అనే నాటకాన్ని వ్రాశాడు. చిత్రాంగద అనే నాటకం ఆయనకు పేరుతెచ్చి పెట్టింది. ప్రకృతి పత్రిక అనే నాటకంలో ప్రపంచాన్ని విడిచి పెట్టిన సన్యాసి కథను వర్ణించాడు. ఇంతేకాక కవచదేవయాని, విసర్జన, శరదొత్సవ్, ముక్తదార, మొదలగు అనేక నాటకాలను రచించాడు మతాలు వేరైనా పరస్పర స్నేహంతో కలిసి మెలిసి ఉండాలని అనే సాంఘీక ప్రయోజనం, ఉత్తమ సందేశం మిళితమై “గోరా” నవల రవీంద్రునికి ఎంతో పేరుతెచ్చి పెట్టింది.

చిత్రకళ,సంగీతం.

రవీంద్రనాథ్ ఠాగూర్ డెబ్బై ఏళ్ల ప్రాయంలో చిత్రకళా సాధనను ప్రారంభించాడు ఆయన వేసిన చిత్రాలు లండన్, ప్యారిస్, న్యూయార్క్ మొదలగు చోట్లా ప్రదర్శింప పడ్డాయి అయినా రెండువేల చిత్రాలను గీశాడు. 

ఠాగూర్ కు సంగీతమంటే మిక్కిలి ప్రీతి ఆయన బెంగాల్ జానపద గీతాలను, బావుల్ కీర్తనలను విని ముగ్దుడయ్యేవాడు ఆయన స్వయంగా గాయకుడు భారత సంగీతంలో రవీంద్ర సంగీతం అనే ప్రత్యేక శాఖను ఏర్పరచిన వాడు రవీంద్రుడు.

స్వాతంత్ర్య సాధన, జనగణమన.

ఠాగూర్ మొదటినుండి జాతీయ భావాలు మెండుగా ఉన్నవాడు. హిందూ మేళాలో దేశభక్తి గీతాలను పాడాడు. పృధ్వీరాజ్ పరాజయం ప్రబొదాత్మక పద్య నాటకాన్ని రచించాడు. బ్రిటీష్ ప్రభుత్వం తిలక్ ను నిర్బంధించినప్పుడు రవీంద్రుడు తీవ్రంగా విమర్శించాడు. బెంగాల్ విబజన ప్రతిఘటనోద్యమంలో ప్రముఖ పాత్ర వహించాడు జాతీయ నిదికి విరాళాలు వసూలు చేశాడు. 1896 లో  జరిగిన కలకత్తా కాంగ్రెస్ సదస్సులో మొట్టమొదటగా బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరాన్ని ఆలపించారు. ఠాగూర్ రాసిన జనగణమన ను జాతీయ గీతంగా ప్రకటించేముందు వందేమాతరం, జనగణమన లపై దేనినీ జాతీయ గీతంగా ప్రకటించాలని చర్చా తర్జన భర్జనలు జరిగాయి. చివరకు రవీంద్రుడు రాసిన జనగణమనదే పైచేయి అయ్యింది. రాజ్యాంగ సభాకమిటి అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 24 న జనగణమనను జాతీయ గీతంగా, వందేమాతరంను జాతీయ గేయంగా ప్రకటించాడు. అదేవిధంగా రెండు సమాన ప్రతిపత్తి కలిగి ఉంటాయని స్పష్టం చేశాడు.

చివరి రోజులు.

తన జీవితంపై రవీంద్రుని ప్రభావమెంతో ఉన్నదని జవహర్లాల్ నెహ్రూ స్వయంగా చెప్పుకున్నాడు. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు ఠాగూర్ మానసికంగా కృంగిపోయీ అనారోగ్యానికి గురయ్యాడు. అంతేకాదు తన ప్రియతములు కొందరు స్వర్గస్థులు కావడంతో భాదను బరించలేక మానసికంగా కుంగిపోయి తీవ్రంగా వ్యాధితో బాధపడుతూ చికిత్సకోసం కలకత్తా నగరానికి వెళ్ళాడు కానీ ప్రయోజనం లేకపోయింది. రచయితగా, సంగీతవేత్తగా, చిత్రకారుడిగా, విద్యావేత్తగా గొప్ప మానవతా వేత్తగా ఠాగూర్ చరిత్రలో నిలిచి పోయాడు. మాతృభూమి మానవ సబందాల పట్ల అచంచలమైన నమ్మకం ప్రేమాభిమానాలు కలిగిఉన్న విశ్వకవి రవీందరనాథ్ ఠాగూర్ 1941 ఆగస్ట్ 7 వన మరణించాడు.

రచన_అరవెల్లి.సౌమ్య, తెలంగాణ కెరటం, చెన్నూర్ నియోజకవర్గం ప్రతినిధి.

ReplyForward