Thursday , May 23 2024

రాష్ట్ర చైర్మన్ వస్తే అందుబాటులో లేని ఆర్ అండ్ బి ఉద్యోగులు

అరగంటకు పైగా వేచి చూచి వెళ్లిపోయిన తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్

– ఒకరోజు ముందు సమాచారం ఇచ్చిన అందుబాటులో లేని సిబ్బంది

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 9;

కామారెడ్డి జిల్లా కేంద్రంలో కోట్లు ఖర్చుపెట్టి ప్రభుత్వ హోదాలో ఎవరు వచ్చిన వారికి విశ్రాంతి తీసుకోవడానికి నిర్మించిన అతిథి గృహం శనివారం తాళం వేసి దర్శనమిచ్చింది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి శనివారం తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ వస్తున్నట్లు ఒకరోజు ముందు శుక్రవారం రోజు సమాచారం ఇచ్చిన శనివారం రోజున సిబ్బంది ఎవరు లేకపోవడంతో ఆయన అరగంటకు పైగా చూసి తిరిగి వెళ్ళిపోయారు. ఈ రోడ్లు భవనాల శాఖ అతిథి గృహాన్ని ఎవరు పర్యవేక్షిస్తున్నారో, ఎవరి ఆధీనంలో ఉందో వారి వారి బాధ్యతలను సరిగా నిర్వహించక ఉన్న స్థాయి అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఎవరు వచ్చినా సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు.