Wednesday , July 24 2024

పౌర సరఫరాల శాఖ పెండింగ్ ఉన్న రా రైస్ గోదాములకు వెంటనే చేర్చాలి…????

జిల్లా కలెక్టర్

తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన ప్రతినిధి మే :

పౌర సరఫరాల శాఖకు పెండింగ్ ఉన్న 36,527 మెట్రిక్ టన్నుల  సి.ఏం.ఆర్.  ధాన్యాన్ని మరాడించి రోజు వారి లక్ష్యం మేరకు పక్షం రోజుల్లో  బియ్యాన్ని గోదాములకు తరలించవలసినదిగా రా రైస్ మిల్లర్లను ఆదేశించామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారికి తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రతిరోజు రైస్ మిల్లులను  సందర్శించి పర్యవేక్షించవలసినదిగా తహసీల్ధార్లను ఆదేశించామని అన్నారు. శనివారం కంటి వెలుగు, ఆరోగ్య మహిళా, సి.ఏం.ఆర్. రైస్, ధాన్యం కొనుగోళ్లు, జి.ఓ. 58,59 క్రింద ఇళ్ల పట్టాలు, క్రమబద్దీకరణ, ప్రధాన మంత్రి  ఆవాస్ యోజన క్రింద పట్టణ  ప్రాంతాలలో   డబుల్ బెడ్ ఇళ్ల పంపిణి వివరాలు ఆన్ లైన్ నమోదు, రసాయన ఎరువులు,  తదితర అంశాలపై సి.ఎస్. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో  తెలిపారు. జిల్లాలో   కంటి వెలుగు, ఆరోగ్య మహిళా కేంద్రాలను పటిష్టవంతంగా నిర్వహిస్తున్నందున మంచి స్పందన లభిస్తున్నదని, ఇప్పటి వరకు జిల్లాలో 3,83,414 మందికి కటి పరీక్షలు నిర్వహించి 41,586 మందికి రీడింగ్ అద్దాలు, 33,333 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు అందజేశామని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా జిల్లాలోని ఆరు ఆరోగ్య మహిళా ద్వారా 3,852 మందిని పరీక్షించి 1,456 మందికి డయాగ్నస్టిక్ పరీక్షలు నిర్వహించామని తెలుపగా సి.ఎస్. సంసంతృప్తి వ్యక్తం చేశారు.  జి.ఓ, 58.59 క్రింద అర్హులైన ఏ ఒక్క లబ్ధిదారుడు నష్టపోకుండా విస్తృత ప్రచారం కల్పిస్తూ  దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని అన్నారు. 

సి.యెస్. శాంతికుమారి మాట్లాదుతు

  రైతుల నుండి సేకరిస్తున్న ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించిన బిల్లులను సత్వరమే చెల్లించేందుకు చొరవ చూపాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్య మహిళా కార్యక్రమం, కంటి వెలుగు శిబిరాలను విరివిగా సందర్శిస్తూ, క్షేత్రస్థాయిలో  మరింత సమర్ధవంతంగా అమలు జరిగేలా చూడాలన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని రైతుల నుండి సేకరించి, పారా బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత తలెత్తకుండా చూసుకోవాలన్నారు. ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో బిల్లులు జమ చేసే విషయంలో జాప్యానికి తావులేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. 

ఈ  వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు  ప్రతిమ సింగ్, రమేష్, డిఆర్ డిఓ  శ్రీనివాస్,  జిల్లా వైద్య  ఆరోగ్య శాఖాధికారి చందు నాయక్,  జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్,జిల్లా వ్యవసాయాధికారి ఆశాకుమారి, డిపిఓ సాయిబాబా, కలెక్టరేట్ ఏ.ఓ. యూనుస్, బలరాం తదితరులు పాల్గొన్నారు.

ReplyForward