ఎట్టకేలకు మోక్షం
ఇళ్లు, ఖాళీ స్థలాలక్రమబద్ధీకరణ
తెలంగాణ కెరటం రంగారెడ్డి జిల్లా
2014 జూన్ 2కు ముందున్నవాటికి అవకాశం
● తాజాగా దరఖాస్తుకు గడువు పొడిగింపు
సర్కారుకు సమకూరనున్న రూ.135కోట్ల ఆదాయం!
,రంగారెడ్డిజిల్లా: జిల్లాలో 2014 జూన్ రెండుకు ముందు ఉన్న నిర్మాణాలు, ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్లు 58, 59, 118 జారీ చేసి దరఖాస్తులకు అవకాశం కల్పించింది. తాజాగా దరఖాస్తు గడువును మరోసారి పొడిగించింది. అందిన అర్జీలను అధికారులు పరిశీలించి, నిబంధనల మేరకు ఉన్న నిర్మాణాలు, ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. దరఖాస్తు దారులు నిర్దేశిత ఫీజు చెల్లించడమే ఆలస్యం.. ఆ తర్వాత వారంలోనే ఆయా భూములు, నిర్మాణాలు లబ్ధిదారుల పేరున రిజిస్ట్రేషన్ అవుతుండటం విశేషం. 8,226 దరఖాస్తులకు..
జిల్లాలో జీఓ నం.58, 59 కింద 31,830 దరఖాస్తులు అందాయి. 59జీఓ కింద 13,229దరఖాస్తులు అందగా వీటి పరిధిలో 38,43,899 గజాల విస్తీర్ణం ఉన్నట్లు అంచనా. మిగిలిన దరఖాస్తులు 58 జీఓకు సంబంధించినవి. ఇక జీఓ నంబర్ 59 కింద 2,750 దరఖాస్తులకు మోక్షం కల్పించారు. అదే విధంగా ఎల్బీనగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో అర్బన్ సీలింగ్ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారి నుంచి ఇప్పటి వరకు 4,672 దరఖాస్తులు అందాయి. వీటిలో 2,780 దరఖాస్తులు అర్హమైనవిగా తేల్చారు. మిగిలిన నిర్మాణాలు, స్థలాలు పెండింగ్‌లో ఉన్నాయి. మూల విలువ ప్రకారం వీటికి ఫీజులు నిర్ణయించి, నోటీసులు జారీ చేస్తున్నారు. ఇక పోడు భూముల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం జీఓ నంబర్ 76 జారీ చేసింది. అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, మంచాల మండలాల పరిధిలో సుమారు 842 ఎకరాల అటవీ భూములు ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లినట్లు సమాచారం. పొజిషన్‌లో ఉన్న భూమి కంటే ఎక్కువగా 1,086 దరఖాస్తులు అందడం విశేషం. మూడు జీఓల కింద అందిన దరఖాస్తులు ఇలా
జీఓ నంబర్ వచ్చిన దరఖాస్తులు ఆమోదం
పొందినవి
58 18,601 2,696
59 13,229 2,750
76 1086 పెండింగ్
118 4672 2,780
ప్రభుత్వ, అర్బన్ సీలింగ్ యాక్ట్ భూముల్లో ఇళ్లు, ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణకు ఎట్టకేలకు మోక్షం లభించింది. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.135 కోట్ల మేర ఆదాయం సమకూరనున్నట్లు జిల్లా రెవెన్యూ యంత్రాంగం అంచనా వేస్తోంది. అవకాశాన్నిసద్వినియోగం చేసుకోండి
ఇళ్లు, ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణకుప్రభుత్వం అకాశం కల్పించింది. 2014 జూన్ రెండుకు ముందు ఉన్న నిర్మాణాల క్రమబద్ధీకరణకు జీఓ 58, ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణకు జీఓ 59 ప్రభుత్వం విడుదల చేిసింది. దరఖాస్తు చేసుకునేందుకు గడువును సైతం పొడిగించింది. ఏప్రిల్ ఒకటి నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తాం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులను చెల్లించి భూములను క్రమబద్ధీకరించుకోవాలి. వీటిని న్యాయబద్ధంగా ప్రస్తుత మార్కెట్ ప్రకారం అమ్ముకునే అవకాశం కూడా లబ్ధిదారులకు ఉంటుంది.
హరీశ్, కలెక్టర్
రంగారెడ్డి జిల్లా