Sunday , May 26 2024

రామారెడ్డి మండల ఎమ్మార్వో కు వినతిపత్రం

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి

కామారెడ్డి జిల్ల రామారెడ్డి మండలం అన్నరం గ్రామం లొ డబుల్ బెడ్ రూములు ఏమీ లేని పేదవారికి కాకుండా ఖాళీ స్థలాలు ఇండ్లు ఉన్నవారికి డబుల్ బెడ్ రూములు మంజూరు చేశారు కొన్ని సంవత్సరాల నుండి కిరాయికి ఉంటున్న పట్టించుకునే నాధుడు లేడు తెలంగాణ ప్రభుత్వం పుణ్యమా అని డబుల్ బెడ్ రూమ్ కీ అప్లికేషన్ పెట్టుకున్నాము వస్తదని ఎంతో ఆశగా ఎదురు చూశాను కానీ ఇందులో కొందరు ప్రజా ప్రతినిధులు మరియు నాయకులు వారికి నచ్చినట్టు వారికి అనుగుణంగా సన్నితంగా ఎవరు ఉంటారో వారి పేర్లను మాత్రమే లిస్టు తయారుచేసి అధికారులకు అందజేశారు ఇప్పుడు మంజూరైన 27 డబుల్ బెడ్ రూమ్ లో 20 పైగా ఖాళీ స్థలాలు మరియు సొంత ఇండ్లు సాగు చేసుకోవడానికి పంట భూములు ఉన్నాయి అర్హులైన మాకు డబుల్ బెడ్ రూమ్ ఉసే లేదు తెలంగాణ ప్రభుత్వం ఏమీ లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూములు మంజూరు చేస్తుంటే అన్నారం గ్రామంలో మాత్రం అందుకు విరుద్ధంగా అన్ని వసతులు ఉన్న వారికి డబుల్ బెడ్ రూములు మంజూరు అవుతున్నవి మాకు డబుల్ బెడ్ రూమ్ లు కేటాయించకపోతే మేము ఎక్కడి వరకైనా పోరాటం చేస్తామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ ఎంపిటిసిలు మరికొందరు నాయకులు వారికి నచ్చిన వారికి డబుల్ రూమ్ పేర్లు ఇచ్చారు అన్నారం గ్రామంలో చాలా అవకతవకలు జరిగాయని వాళ్లకు నచ్చిన వాళ్ళకి లిస్టు తయారుచేసి అధికారులకు అందజేశారని బాధితులు ఆరోపిస్తున్నారు నా రెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ డబుల్ బెడ్ రూములు లేని వారికి కాకుండా ఉన్నవారికి డబుల్ బెడ్ రూమ్ కేటాయించారని అర్హులకి డబుల్ బెడ్ రూమ్ లు కేటాయించాలని లేదంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు ఇందులో భాగంగా నా రెడ్డి మోహన్ రెడ్డి నా రెడ్డి మహేందర్ రెడ్డి మరియు బాధితులు ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకొని ఎమ్మార్వో అందుబాటులో లేకపోవడంతో అటెండర్ అయినా రాజేందర్ కు వినతి పత్రం అందజేశారు