తెలంగాణ కెరటం స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ప్రతినిధి ఫిబ్రవరి 26
మండల కేంద్రం క్యాథలిక్ చర్చి ఆవరణలో శనివారం రోజున సాయంత్రం ప్రజాసంఘాల వేదిక నిర్వహణ వేల్పుల రవి ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ యొక్క జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు, దళిత బహుజన, పీడిత కులాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన తీరును, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా సందేశాన్నిస్తూ.. అభ్యుదయఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ వారి చే 20 మంది కళాకారులతో భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. కార్యక్రమానికి ముందుగా చర్చి ఫాదర్ జోసెఫ్, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ బొడ్డు వసంత కుమార్, పాస్టర్ గంగారపు కమలాకర్,
బొడ్డు ప్రభుదాస్, గుర్రపు రాజేంద్రప్రసాద్, గంటే సదయ్య, శ్రీరాముల విజయ్, సంఘ పెద్దలు మాచర్ల ప్రవీణ్, బొడ్డు సురేందర్, నక్క ప్రవీణ్ , ప్రజాసంఘాల నాయకులు అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేల్పుల రవి మాట్లాడుతూ సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆర్థిక, సామాజిక న్యాయం, బహుజనుల రాజ్యాధికారం కోసం అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన భారత దేశంలో భారతరాజ్యాంగాన్ని, కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో, అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం జగ్గరాజు, టీం కెప్టెన్ సురేష్, మేనేజర్ ఎం ప్రశాంత్, చిరంజీవి రాజు, కే గోపి, ఉద్యోగ సంఘం నేత బొడ్డు ప్రసాద్, జర్నలిస్టుల సంఘం నేతలు పొడిశెట్టి కరుణాకర్, ఇసంపల్లి రమేష్, బొల్లం సాంబరాజు, రాఘవులు, ధర్మసాగర్ జై భీమ్
ఫౌండేషన్ సంఘం సభ్యులు,
రోజా, సంధ్య, ఉద్యోగులు, విద్యార్థులు, సామాజిక, సంఘాలు, అభ్యుదయవాదులు, స్థానిక, ప్రజానీకం, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.