Thursday , May 23 2024

రాజన్న కోవెలలోహిజ్రా ను పెళ్లాడిన యువకుడు కోవెలలో కొరవడిన పర్యవేక్షణ..!

రాజన్న కోవెలలో
హిజ్రా ను పెళ్లాడిన యువకుడు

కోవెలలో కొరవడిన పర్యవేక్షణ..!

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తెలంగాణ కెరటం ప్రతినిధి జూన్ :-17

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన (హిజ్రా)పింకీ (22) ని హైదరాబాద్ కు చెందిన శ్రీనివాస్(23) శనివారం రోజున రాజన్న ఆలయంలో వివాహమాడాడు శ్రీనివాస్ పింకీలు గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుని
పెద్దల అంగీకారంతోనే వివాహం చేసుకున్నట్లు తెలిపారు ఇది ఇలా ఉండగా ఆలయం అంతర్బాగం లో వివాహాలు చేసుకోకూడదనే నిబంధనలు ఉన్నాయి ఆ జంట వివాహం చేసుకున్న సమయంలో ఆలయంలో ఏ ఈ ఓ స్థాయి అధికారి నుండి సుమారు 20 మంది వరకు ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు కాలభైరవ స్వామి ఆలయం ముందు సుమారు ఒక గంట పాటు వివాహ తంతు జరిగిన ఆ విషయాన్నీ విధులు నిర్వహిస్తున్న ఏ ఉద్యోగి కూడా గమనించకపోవడంతో ఆలయంలో పర్యవేక్షణ కొరవడినట్టే తేటతెల్లమవుతుంది ఆలయ ఉన్నతాధికారులు ఆలయంలో జరిగిన ఈ వివాహం గురించి చూసి చూడనట్లు వ్యవహరిస్తే రానున్న రోజులలో ఆలయ పరిసరాలు మొత్తం వివాహ వేదికగా మారి భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉన్నందున ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకొని
ఆలయ ప్రతిష్ట ను కాపాడవలసిన అవసరం ఎంతయినా ఉన్నది