Wednesday , July 24 2024

స్వయం స్వపరిపాలన దినోత్సవం

తెలంగాణ కెరటం:రాయపోల్ ప్రతినిధి :ఫిబ్రవరి 21

దౌల్తాబాద్ మండలంలోని జెడ్ పి హెచ్ ఎస్ ముబారస్ పూర్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎ.లక్ష్మయ్య సార్ గారు, ఉపాధ్యాయుల బృందం ఆధ్వర్యంలో స్వయం స్వపరి పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వపరిపాలన దినోత్సవంలో భాగంగా ఒక్క రోజు ఉపాధ్యాయులు అయిన వేళ విధ్యార్థులు ఉపాధ్యాయ వృత్తిలో తమ తమ అనుభవాలను విధ్యార్థులతో, ఉపాధ్యాయులతో పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో డి ఈ ఓ అతీఫ్, యం ఈ ఓ అక్షయ, డి వై ఈ ఓ బన్నీ, హెడ్మాస్టర్ రెహన్ బాబా,నందిని,కావ్య,మధుప్రియ,ఆసిన్,ముస్కాన్ ఒక్క రోజు ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించారు.
చిన్నారి విధ్యార్థులు ఉపాధ్యాయులైన వేళ ప్రధానోపాధ్యాయులు లక్ష్ఉపాధ్యాయుల బృందం విశ్వనాథం,బాలకిషన్, పర్శరాములు,వెంకటేశం, జనార్ధన్,జరీనా సుల్తాన,స్వామి సార్ విధ్యార్థులకు అభినందనలు తెలియజేశారు.